నాగచైతన్యతో మహేష్ డైరెక్టర్.. ఇక లేనట్లే?

గీతా గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన దర్శకుడు పరుశురాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ రష్మికా మందన్నలతో తీసిన గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్టు అయింది. ఆ తర్వాత డైరెక్టర్ పరుశురాం.. అక్కినేని నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు. అల వైకుంఠపురంలో సినిమా లాంటి ఓ కథను దర్శకుడు పరుశురాం చై కోసం రాసుకున్నట్లు చెప్పాడు. కానీ అంతలోపే మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమా ముందుకు రావడంతో.. చై సినిమాను హోల్డ్ లో పెట్టేశాడు.

సర్కారు వారి పాట సినిమా తర్వాత నాగ చైతన్య సినిమాను ప్రారంభిస్తారని అంతా అనుకున్నారు. ఆ సినిమా కోసం నాగేశ్వర రావు అనే వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ సినిమూ షూటింగ్ షెడ్యూల్ కు సంబంధించి ఎలాంటి సమాచారమూ లేదు.

సర్కారు వారి పాట విడుదలై ఏడు నెలలు గడుస్తున్నా.. చై పరుశురాంల సినిమా పట్టాలెక్కలేదు. దీంతో అందరూ ఈ సినిమా ఆగిపోయిందనే భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన చాలానే వార్తలు వస్తున్నాయి. అయితే డైరెక్టర్ పరుశురాం నాగ చైతన్య కోసం రాసిన కథ... చైకి నచ్చలేదని తెలుస్తోంది.

స్క్రిప్టు విషయం పూర్తి స్థాయిలో సంతృప్తి లేకపోవడంతో.. నాగ చైతన్య సినిమా నుంచి తప్పుకున్నారని టాలీవుడ్ కోడై కూస్తోంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉన్న హీరో ఓ కంపెనీలో చేరి అక్కడే ఉన్న లేడీ బాస్ తో లవ్ ట్రాక్ నడుపుతాడని.. ఇందులో హీరోయిన్ డామినేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందని.. అందుకే చై ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. చైతన్య ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో డైరెక్టర్ పరుశురాం విజయ్ దేవర కొండను కలిసినట్లు తెలుస్తోంది.

అయితే గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గీతా గోవిందం సూపర్ సక్సెస్ సాధించడంతో.. మరోసారి వీరిద్దరూ కలిసి పని చేసేందుకు ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ ఒప్పుకుంటే... 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

అయితే ఇందుకు సంబంధించిన చిత్రబృందం నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. అలాగే డైరెక్టర్ పరుశురాం కూడా ఈ ప్రాజెక్టుపై నోరు మెదపడం లేదు. చూడాలి మరి ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారు ఎప్పుడు సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందో.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×