జగన్ని గద్దే దింపేస్తా... ఒట్టేసి చెప్పిన లోకేష్

ఏపీలో సీఎం జగన్ పాలన ఉండకూడదంతే అని ప్రతిన పూనారు యువ నేత నారా లోకేష్. వికృత రాక్షస అరాచక పాలనను అంతమొందిస్తామని కూడా శపధం చేశారు. ఈ పాలన వద్దు అని అన్ని వర్గాలు కోరుకుంటున్నారని అందుకే తాను ఉద్యమిస్తున్నాని అని ఆయన అంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. ఏపీలో జగన్ సర్కార్ కి బాధితుడు కాని వారు ఎవరని ఆ లేఖలో ఆయన ప్రశ్నించడం విశేషం.

ఏపీలో జగన్ పరిపాలన ఒక విద్వంశంగా సాగుతోందని అన్నారు. యువగళం పేరిట నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్రకు లోకేష్ రెడీ అయ్యారు. ఈ నెల 27న మధ్యాహ్నం కుప్పం నుంచి లోకేష్ తొలి అడుగు పడుతుంది.అది అక్కడితో ఆగేది కాదు మొత్తం ఏపీ అంతా చుట్టుముడుతుంది. అలా లోకేష్ పాదయాత్రను డిజైన్ చేశారు.

మరి యువగళం పాదయాత్ర ఎవరి కోసం ఎందు కోసం అన్నది లోకేష్ తాను రాష్ట్ర ప్రజలకు రాసిన రెండు పేజీల లేఖ ద్వారా తేటతెల్లం చేశారు. ఏపీని అన్ని విధాలుగా జగన్ ప్రభుత్వం బ్రష్టు పట్టించిందని లోకేష్ నిందించారు. ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించకపోతే ఏపీకి భవిష్యత్తు లేదని ఆయన చెప్పేశారు.

ఒక్క చాన్స్ అంటూ అడిగి గద్దెనెక్కిన జగన్ కర్షకులు కార్మికులు మహిళలు ఉద్యోగులు నిరుద్యోగులు యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలను కూడా నానా రకాలైన బాధలు పెట్టారని అన్నారు ఒక్క చాన్స్ అంటే సర్వనాశనమే అని రుజువు చేశారని మండి పడ్డారు.

ఈ ప్రభుత్వంలో యువతకు భవిష్యత్తు లేదని వారి మంచి కోసం తాను అడుగులు వేస్తున్నాను అని చెప్పారు. అలాగే రైతన్నల కళ్ళలో ఆనందం కోసం తాను చూస్తున్నాను అని అన్నారు. అదే విధంగా ఏపీని అభివృద్ధి పధంలో నడిపేందుకే తన పాదయాత్ర అని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా దించేంతవరకూ తన పోరాటం ఆగదని లోకేష్ ప్రతిజ్ఞ చేశారు. ఏపీలో అన్ని వర్గాల బాధిత ప్రజల తరఫున తాను పాదయాత్రను తలపెట్టాలని అందువల్ల తనకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

ఏపీలో జగన్ నియంత కంటే దారుణంగా పాలిస్తున్నారు అని ఘాటైన విమర్శలు చేశారు లోకేష్. కులం మతం ప్రాంతం అంటూ అందరినీ విడదీస్తూ విద్వేషపూరిత రాజకీయాలకు జగన్ తెరతీశారని అన్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రీవేట్ సైన్యంగా మార్చుకున్నారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

జగన్ ఏలుబడిలో అభివృద్ధి అన్నది లేదని ఏ వర్గం అయినా బాదుడే బాదుడు అన్నట్లుగా పన్నులు వసూల్ చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వంలో శాంతిభద్రతలు కూడా లేవని ప్రజల మాన ప్రాణాలకు కూడా ఠికాణా అసలు లేదని ఆయన అన్నారు. మొత్తానికి లోకేష్ జగన్ మీద తన సమర శంఖారావాన్ని పూరిస్తున్నారు లోకేష్ మరి. ఆయన పాదయాత్ర ఏపీ రాజకీయాన్ని ఏ విధంగా మారుస్తుంది అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×