భారత్-పాక్ అణు యుద్ధానికి బ్రేకులు వేసిందెవరు?

భారత్-పాక్ మధ్య కాశ్మీర్ వివాదం ఎన్నో ఏళ్లుగా రావణకాష్టంలా మండుతున్న సంగతి తెల్సిందే. భారత్ లో అంతర్భాగమైన కశ్మీర్ ను పాక్ కొంతమేర ఆక్రమించింది. దీనిని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా పిలుస్తున్నారు. ఆయుధ సంపత్తిలో భారత్ కు ఏమాత్రం పోటీలేని పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేయలేక ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పుతోంది.

ఈ క్రమంలోనే సరిహద్దుల్లోని భారత జవాన్లను టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతోందన్నారు. ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఎందరో జవాన్లు అమరవుతున్నారు. సరిహద్దుల్లో పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడటంతోపాటు ఉగ్రవాదులతో చేతులు కలిపి భారత్ పై దొడ్డిదారిన యుద్ధం చేస్తోంది.

పాక్ నక్కజిత్తులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. అయితే కొన్ని సమయంలో ముష్కర మూకలు ఊహించని విధంగా దాడులకు తెగబడుతుండటంతో అమాయక ప్రజలతోపాటు సైనికులు ప్రాణాలను కోల్పోతున్నారు. 2019లో కశ్మీర్ లోని పుల్వామాలో తీవ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డటం అప్పట్లో సంచలనంగా మారింది.

ఈ దాడిలో చాలా మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల్లోని తీవ్రవాదులను ఏరివేసేందుకు బాలాకోట్ పై భారత ఆర్మీ రహస్య ఆపరేషన్ చేపట్టింది. భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి తీవ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సమయంలో భారత్-పాక్ అణుబాంబులు ప్రయోగించుకోవడానికి సిద్ధమైనట్లు నాటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ క్యాబినేట్ లో మంత్రిగా పని చేసిన మైంక్ పాంపియా తన పుస్తకంలో పేర్కొన్నారు.  ''నెవర్ గివ్ యాన్ ఇంచ్.. ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్'' అనే పుస్తకంలో ఆయన ఈ విషయాన్ని తాజాగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.

పుల్వామా ఆత్మాహుతి ఘటన తర్వాత భారత్.. పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇరుదేశాల అధికారులు విశ్వసించారని మైక్ పాంపియా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అణు యుద్ధానికి సిద్ధపడడం లేదని ఇరుదేశాల్నీ అమెరికా ఒప్పించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

పాకిస్థానీలు తమ అణ్వాయుధాలను దాడులకు సిద్ధం చేసుకోవడం ప్రారంభించారని.. అదే సమయంలో తాము అంతకు మించిన దాడికి సిద్ధం కావడంపై భారత్ కూడా ఆలోచించిందని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు. అప్పట్లో భారత్ పాక్ అణుదాడికి ఎంత దగ్గరగా వచ్చాయనేది ప్రపంచానికి తెలియదన్నారు. ఇది తాము కూడా ఊహించలేదని.. చివరికి ఎలాగోలా అణుదాడి ప్రయత్నాలు ఆపినట్లు పాంపియో చెప్పుకొచ్చారు.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×