నెట్ ఫ్లిక్స్ లో టాప్ రేటింగ్ లో ఫౌదా 4..!

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న వెబ్ సీరీస్ ఫౌదా సీజన్ 4. 2015లో మొదలైన ఈ వెబ్ సీరీస్ ఇప్పటికే 3 సీజన్లు రిలీజ్ చేయగా లేటెస్ట్ గా సీజన్ 4ని తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ వెబ్ సీరీస్ గా వచ్చిన ఈ వెబ్ సీరీస్ ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరిస్తుంది.

అయితే ఈ సీరీస్ లోని చాలా సీన్స్ బాలీవుడ్ టాలీవుడ్ లో చూసిన సీన్స్ లానే ఉన్నాయి. తెలుగులో వచ్చిన ది ఘోస్ట్ ఆఫీసర్ సినిమాలు కూడా అలానే ఉంటాయి. అయినా కూడా ఫౌదా సీజన్ 4 ప్రత్యేకంగా నిలిచింది.

నెట్ ఫ్లిక్స్ సీరీస్ లు ఇండియాలో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఫౌదా సీజన్ 4 చూసిన వారికి అందులోని సీన్స్ కొన్ని ఇక్కడ సినిమాలకు కాపీ లానే అనిపించాయి. అయినా కూడా ఫౌదా సీజన్ 4 నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషనల్ సృష్టిస్తుంది.

ఈ వెబ్ సీరీస్ స్టోరీ అంత గొప్ప కథ కాకపోయినా ఎమోషనల్ గా సాగించిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇజ్రాయెల్ లో యూదులు అరబ్ ల మధ్య జరిగిన సంఘర్షణ నేపథ్యంతో ఈ వెబ్ సీరీస్ తెరకెక్కింది.  

ఈ వెబ్ సీరీస్ ను ఎంతో గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. అంతేకాదు ఈ సీరీస్ ను డైరెక్ట్ చేసిన విధానం కూడా ప్రేక్షకులను అలరించింది. అయితే ఫౌదా లాంటి వెబ్ సీరీస్ లు ఇండియన్ సినిమాల్లో తీయాలని ప్రయత్నించినా ఆ బ్యాక్ డ్రాప్ మనకు అంతగా సూట్ అవ్వదని చెప్పుకోవచ్చు.

ఏది ఏమైనా నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ కి ఫౌదా కొత్త సీరీస్ ఎంటర్టైన్ చేస్తుంది. సీజన్ 4 గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వరల్డ్ సినీ ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఫౌదా సీజన్ 4 వచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×