అన్ని పార్టీల్లోనూ కేసీఆర్కు కోవర్టులు.. బాంబు పేల్చిన ఈటల

తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్ బాంబు పేల్చారు. ఒకప్పుడు టీఆర్ఎస్ కు వెన్నుముకగా.. కేసీఆర్ రైట్ హ్యాండ్ లా ఉండే ఈటల ఆ తర్వాత కేసీఆర్ కోపాగ్నికి బలై గళం పెంచి అవమానకర రీతిలో బీఆర్ఎస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. మంత్రి పదవి కోల్పోయి.. భూములపై కేసులు చుట్టుముట్టిన వేళ బీజేపీలో చేరిపోయారు. కేసీఆర్ ను ఎదురించి ఓడించి హుజూరాబాద్ లో బీజేపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తారు? ఎలా ఆలోచిస్తారన్న విషయాలన్నీ ఈటలకు బాగా తెలుసు. అందుకే ఈటల మాట్లాడితే ఓ లెక్కా పత్రం ఉంటుంది. అందరిలా ఈటల నోరు పారేసుకోరు. తాజాగా కేసీఆర్ గురించిన మరో రహస్యాన్ని బయటపెట్టిన ఈటల సంచలనం రేపారు.

2018లో తనతోపాటు 20 మందిని ఓడించేందుకు ప్రత్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంచారని ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్ కమిటీ లేదని.. బీజేపీలో జాయినింగ్ కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్ అవుతున్నాయన్నారు. అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఈటల అభిప్రాయపడ్డారు.

అటు కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఈటల ఇటు తన సొంత పార్టీ బీజేపీ లూప్ హోల్స్ ను బయటపెట్టడం సంచలనమైంది. బీజేపీ చేరికల కమిటీ వల్ల ముందే ఎవరు చేరుతున్నారో లీక్ అవుతోందని.. అందుకే బీజేపీలో చేరికకు ఎవరూ రావడం లేదని ఈటల అభిప్రాయపడ్డారు.

చేరికలన్నివి గుట్టుచప్పుడు కాకుండా హామీలిచ్చి ఒప్పించి చేసేవి అని.. బీజేపీలో ఓపెన్ గా జరగడంతోనే ఎవరూ రావడం లేదని ఈటల అన్నారు. ప్రస్తుతం బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×