వాజ్ పేయి నాడు పన్నిన వ్యూహం.. జైశంకర్ చెప్పిన నిజం..

భవిష్యత్ లో మరెప్పుడైనా బీజేపీ అధికారంలోకి వస్తే వాజ్ పేయి గురించి చెప్పుకోవాల్సిందేనని కొందరు బీజేపీ నాయకులు అంటుంటారు. అందులో భాగంగానే ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వాజపేయి చేసిన విధానాల గురించి గుర్తు చేసుకున్నారు. విదేశాలతో ముఖ్యంగా అమెరికా రష్యాతో సంబంధాలు నెలకొల్పడంలో వాజ్ పేయి  తీసుకున్న నిర్ణయాలు అప్పుడు బాగా పనిచేశారు. ఇప్పుడు నేటి బీజేపీ ప్రభుత్వం కూడా వాజ్ పేయి విధానాలనే ఆనుసరిస్తుందని జే శంకర్ చెప్పడం ఆసక్తిని రేపుతోంది. అయితే వాజ్ పేయి ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..? అసలేం జరిగింది..?

దేశంలో వాజ్ పేయి కాలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు భారత్ అలీన విదేశాంగ విధానం అవలంభిస్తోందని అన్నారు. అలీన విధానం అంటే రష్యా అమెరికాకు దూరంగా ఉండడం. కానీ ఆ సమయంలో రష్యా చెప్పుచేతుల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో అమెరికా భారత్ కు శత్రువుగా ఉంటూ వచ్చింది. అంతేకాకుండా దాయాది దేశం పాకిస్తాన్ ను రెచ్చగొడుతూ ఉండేది. దీంతో భారత్ పాకిస్తాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.

ఈ నేపథ్యంలో సొంతంగా అణ్వాయుధాలను ఏర్పాటు చేసుకోవడంలో అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం కొంత మేరకు సక్సెస్ అయింది. మన విధానం మనకు ఉండాలని అప్పట్లో అణు పరీక్షలు చేశారు.

అయితే ఈరోజు రష్యాపై అమెరికా ఎలా ఆంక్షలు పెడుతుందో.. అప్పట్లో భారత్ పై యూఎస్ వ్యతిరేకంగా మారడానికి ప్రయత్నించింది. అమెరికాతో పాటు యూరప్ దేశాలు సైతం భారత్ పై కాస్త గుర్రుగానే ఉన్నాయి.

ఇదే సమయంలో భారత్ కు చెందిన దౌత్య వేత్తలు వివిధ దేశాల్లో ముందుగానే పాగా వేశారు. సరిగ్గా అణుపరీక్షలు చేసే సమయంలో ఆయా ప్రభుత్వాలతో మాట్లాడారు. రష్యాతో ఏ పరిస్థితుల్లో భారత్ స్నేహంగా ఉండాల్సి వచ్చిందో వివరించారు. అంతేకాకుండా భారత్ నిర్వహించే అణు పరీక్షలను గుర్తించాలని కోరారు. దీంతో అమెరికా అప్పటి నుంచి భారత్ తో స్నేహంగా ఉంటూ వచ్చింది. ఇలా వాజ్ పేయి అవలంభించిన విధానాలు అప్పట్లో సక్సెస్ అయ్యాయి.

ఇదే విషయాన్ని జై శంకర్ చెప్పారు. అప్పటికీ ఇప్పటికీ విదేశాంగ విషయాల్లో భారత్ తెలివిగానే ప్రవర్తిస్తుందని అంటున్నారు. ఏ చర్యలు తీసుకున్నా భారత్ స్వప్రయోజనాల కోసమేనన్నారు.

బీజేపీ ప్రభుత్వంలో పటిష్టమైన ఆయుధ వ్యవస్థ ఇప్పుడు భారత్ లోఉంది. భవిష్యత్ లో ఎలాంటి శత్రువులు ఎదుర్కొన్నా సొంతంగా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం. అందువల్ల బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×