అబ్బాయి సినిమాలో బాబాయి ఆల్ టైమ్ సూపర్ హిట్..!

నందమూరి కళ్యాణ్ రామ్‌ గత చిత్రం బింబిసార సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్‌ కి బింబిసార సినిమా తో విజయం దక్కింది. ఆ విజయాన్ని కంటిన్యూ చేసే విధంగా అమిగోస్ సినిమాతో కళ్యాణ్ రామ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అమిగోస్‌ సినిమా పై అభిమానుల్లో ఉన్న అనుమానాలు తొలగించే విధంగా కళ్యాణ్ రామ్ ఒక ప్రమోషనల్‌ వీడియోను వదిలాడు. ఆ వీడియోలో అమిగోస్ అంటే ఏంటీ.. సినిమా నేపథ్యం ఏంటీ అనే విషయాలను వెల్లడించారు.

ఫ్యాన్స్ ఈలలు వేస్తూ.. గోలలు చేసే విధంగా కళ్యాణ్ రామ్‌ ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్‌ ను ఇచ్చాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ చిత్రం ధర్మక్షేత్రం సినిమాలోని సూపర్‌ హిట్‌ మూవీ ఎన్నో రాత్రులు వస్తాయి కానీ.. పాటను రీమిక్స్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బాబాయి సూపర్‌ హిట్ పాటతో అబ్బాయి రాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. అధ్బుతమైన ఆ పాటను కాస్త మార్చి.. లిరిక్స్ లో మార్పు లేకుండా రీమేక్స్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒరిజినల్‌ ఫ్లేవర్‌ మిస్‌ అవ్వకుండా ఆ పాటను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే కచ్చితంగా అమిగోస్ కు ప్లస్ అవుతుంది.

మూడు విభిన్నమైన పాత్రల్లో కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ముగ్గురు ఒకే రూపు ఉన్న వారు తారస పడితే ఎలా ఉంటుంది.. వారు ముగ్గురు మూడు విభిన్నమైన మనస్థత్వాలు కలిగి ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథ గా తెలుస్తోంది. అమిగోస్ తో కళ్యాణ్ రామ్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

 
 
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×