బాలీవుడ్ లో పెద్ద దుమారంకి తెర లేపిన అల్లు అర్జున్ సినిమా

అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురంలో ప్రస్తుతం బాలీవుడ్ లో గొడవకు కారణం అయ్యింది. అల వైకుంఠపురంలో సినిమా యొక్క డబ్బింగ్ వర్షన్ రైట్స్ ను గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నారు.

పుష్ప సూపర్ హిట్ అయిన నేపథ్యం అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో సినిమా కు ఉత్తరాదిన మంచి డిమాండ్ ఉందని డబ్బింగ్‌ వర్షన్ ను థియేటర్‌ రిలీజ్ కు సిద్ధం చేశారు. కానీ అప్పటికే కార్తీక్ ఆర్యన్‌ హీరోగా అల వైకుంఠపురంలో సినిమా యొక్క రీమేక్ ప్రారంభం అయ్యింది.

ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్దలు రాజీ కుదిర్చి అల వైకుంఠపురంలో సినిమా యొక్క డబ్బింగ్ వర్షన్‌ థియేట్రికల్‌ రిలీజ్ కాకుండా చేశారు. ఇప్పుడు కార్తీక్‌ ఆర్యన్‌ నటిస్తున్న రీమేక్‌ షెహజాదా చిత్రం రిలీజ్ కు సిద్ధం అయ్యింది. ఇటీవలే విడుదల అయిన షెహజాదా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్‌ దక్కింది.

ఫిబ్రవరి 10న షెహజాదా విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సమయంలోనే అల వైకుంఠపురంలో డబ్బింగ్ వర్షన్‌ ను గోల్డ్‌ మైన్‌ వారు యూట్యూబ్‌ ద్వారా స్ట్రీమింగ్‌ కు సిద్ధం చేశారు. షెహజాదా థియేట్రికల్ రిలీజ్ కు వారం రోజుల ముందు అంటే ఫిబ్రవరి 2న యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

అల వైకుంఠపురంలో సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్‌ యూట్యూబ్‌ లో స్ట్రీమింగ్‌ అయితే.. ఆ తర్వాత వచ్చిన రీమేక్ వర్షన్‌ షెహజాదా కు ఓపెనింగ్స్ విషయంలో ప్రభావం పడే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

డబ్బింగ్ వర్షన్‌ ను యూట్యూబ్‌ లో స్ట్రీమింగ్ కాకుండా చూసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో సినిమా యొక్క డబ్బింగ్ మరియు రీమేక్‌ వర్షన్ లు బాలీవుడ్‌ లో పెద్ద దుమారానికి తెర లేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు పెద్దలు ఎవరు ముందుకు వస్తారు అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

 
 
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×