టెక్కీలు అప్ డేట్ కావాల్సిందేనా? లేకుంటే జాబ్ లేనట్టే?

అమెజాన్ నుంచి 18వేలు.. గూగుల్ నుంచి 12 వేలు.. మైక్రో సాఫ్ట్ నుంచి 5 శాతం ఉద్యోగాలు పోయాయని మనం వింటున్నాం. కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి బాగోలేనందున చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వానన పలికాయి. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. మరి ఎందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం మోహమాటం లేకుండా సిబ్బందిని ఎందుకు వదులుకుంటున్నాయి..?  తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (టీఐటీఏ) ఉద్యోగాలు పోయిన వారిపై స్టడీ చేసింది. తేలిన అంశమేమిటంటే వారిలో అప్డేట్ స్కిల్స్ లేకపోవడమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో 24 శాతం కంపెనీల్లోనే సరైన నిపుణులున్నారు. మిగతా 74 శాతం ఉన్నవాటిలో అన్ స్కిల్డ్ ఎంప్లాయిసే కొనసాగుతున్నారు. దీంతో చాలా కంపెనీలు నైపుణ్యం ఉన్న వారి కోసం ఎదురుచూస్తున్నాయి.  ఈ నేపథ్యంలో టెక్కీలు అప్డేట్ కాకపోతే తమ జాబ్ లేనట్లేనని తెలుస్తోంది.

ఇప్పుడంతా డిజిటల్ యుగం. ప్రతీ రంగంలో టెక్నాలజీ పాతుకుపోయింది. ఈ నేపథ్యంలో మూస పద్దతిలో పనిచేస్తామంటే ఇక కుదరని పరిస్థితి. చాలా కంపెనీలు మధ్య అప్డేట్ వర్షన్ ఏర్పరుచుకోవడంతో వాటి మధ్య తీవ్ర పోటీ ఉంటోంది. ఈ నేపథ్యంలో స్కిల్డ్ ఎంప్లాయిస్ మాత్రమే తమ కంపెనీలో ఉండాలని కోరుకుంటోంది. అయితే కొన్ని కంపెనీలు అప్డేట్ కావడానికి ఒక అవకాశం ఇస్తున్నాయి. కుదరకపోతే నిరభ్యరంతరంగా ఇంటికి పంపేస్తున్నాయి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (టీఐటీఏ) 120 మంది ప్రొఫైల్స్ పై స్డడీ చేసింది. వీరంతా అప్డేట్ కానివారేనని తేలింది.

కరోనా సమయంలో చాలా హెల్త్ టెలీ మెడిసిన్స్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ యాప్స్ కోసం ఇబ్బడిముబ్బడిగా రిక్రూట్మెంట్ చేశాయి. జీతాలు కూడా భారీస్థాయిలో ప్రకటించాయి. ప్రసిద్ధ కంపెనీలు పలువురు క్లయింట్స్ తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో మంది పెట్టుబడుదారులు ముందుకు వచ్చారు. డిజిటల్ మార్కెట్ పుంజుకోవడంతో చాలా కంపెనీలు ఉద్యోగులను నియమించుకున్నాయి. అయితే ఒప్పందాలు పూర్తవడంతో కొన్ని కంపెనీలో మూసేసే స్థితికి వచ్చాయి. పెద్ద పెద్ద కంపెనీలు మాత్రం ఆర్థికి స్థితిని స్థిరంగా ఉంచుకోవడానికి ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇలాంటి చర్యల్లో గూగుల మైక్రోసాప్ట్ లాంటివి ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలో అనవసరంగా ఉద్యోగులను నియమించుకునే పరిస్థితి లేదు. నైపుణ్యం గల వారికి మాత్రమే ఎంచుకుంటున్నాయి. సాఫ్ట్ వేర్ రంగంలో అప్డేట్ గా ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తోంది. కొన్ని కంపెనీలు చాలా మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు కనిపిస్తున్నా.. అదే సమయంలో స్కిల్డ్ ఎంప్లాయిస్ కోసం ఎదురుచూస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే అప్డేట్ వర్షన్ తో యువత రెడీగా ఉంటే ఎప్పుడూ వారికి అవకాశాలకు కొదవ లేదనే చెప్పవచ్చు. లేకుంటే అక్కడితో ఆగిపోయే పరిస్థితి ఉంటుందని టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×