పాపం వెంకీ కుడుముల అంటున్నారా?

ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. అది వుంటే ప్రతీ ఒక్కరు మనల్ని వెతుక్కుంటూ వస్తారే కానీ మనం వెతుక్కుంటూ వెళ్లాల్సిన పని లేదన్నది ఇండస్ట్రీలో చాలా మంది తల పండిన వాళ్లు చెప్పే మాట. ఇది చాలా సందర్భాల్లోనూ నిజమైంది. ఇప్పటికీ అదే జరుగుతోంది కూడా. అయితే విచిత్రం ఏంటంటే సక్సెస్ లో వున్న దర్శకుడిని పిలిచి అవకాశం ఇచ్చిన వాళ్లు ఆ తరువాత తూచ్ అంతా ఉత్తిత్తినే అనేస్తే వారు పడే మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇదే తరహాలో ఆవేదనకు గురయ్యాడట యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల.

'ఛలో' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న వెంకీ కుడుముల అదే ఊపుతో మరో హిట్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కించిన 'భీష్మ' సూపర్ హిట్ అనిపించుకుని వెంకీ కుడుములకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయంతో మెగాస్టార్ చిరు దృష్టిలో పడిన వెంకీ కుడుముల ఊహించని విధంగా చిరుని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ మూవీని ప్రారంభిస్తామంటూ అధికారికంగా ప్రకటించారు కూడా. ఊహించని అవకాశం మూడవ సినిమాకే దక్కడంతో వెంకీ కుడుముల ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. ఈ ఆనందం అతనికి ఎంతో సేపు నిలవలేదు.

నెలలు గడుస్తున్నా ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. కారణం ఏంటని ఆరా తీస్తే అంతా తూచ్ ఈ ప్రాజెక్ట్ మనం చేయడం లేదన్నారట చిరు. ఉన్నట్టుండి అలా అనేసరికి వెంకీ కుడుముల షాక్ కు గురైనట్టుగా చెబుతున్నారు.

పిలిచి సినిమా చేస్తానని అధికారికంగా ప్రకటించాక ఇలా షాకిచ్చారేంటని వెంకీ కుడుముల షాక్ కు గురవుతుంటే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం పాపం వెంకీ కుడుముల అంటూ సింపతీ చూపిస్తున్నారట. గతంలోనూ చిరు ఇదే తరహాలో సుజీత్ ని 'గాడ్ ఫాదర్' కోసం వాడుకుని ఆ తరువాత ఆ బాధ్యతల్ని మోహన్ రాజాకు అప్పగించి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ దర్శకుడి తరువాత వెంకీ కుడుములకు కూడా చిరు ఇలాగే షాక్ ఇవ్వడం ఇప్పు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా వుంటే ఈ విషయాన్ని పక్కన పెట్టిన వెంకీ కుడుముల తనకు కలిసి వచ్చిన హీరో నితిన్ తో సినిమాకు రెడీ అయిపోతున్నాడని తెలిసింది. చిరుతో సినిమా అని ప్రచారం జరిగి అది ఆగిపోవడంతో ఫీలైన వెంకీ కుడుముల నితిన్ తో చేయబోతున్న సినిమాతో తనేంటో మారోసారి నిరూపించి తనని పక్కన పెట్టిన వారికి సినిమా రిజల్ట్ లో సమాధానం చెబుతాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.  నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×