రెండు దశాబ్ధాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ లోకి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొడుతున్నాడు. వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్ తన తదుపరి చిత్రం `హరి హర వీర మల్లు` కోసం స్వేదం చిందిస్తున్నాడు. హిస్టరీ నేపథ్యంలోని వారియర్ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించే ముందు అతడు మార్షల్ ఆర్ట్స్ లో బాగా శిక్షణ పొందాడు. ఖుషీ-తమ్ముడు లాంటి సినిమాలు మినహా పవన్ కళ్యాణ్ తన ఇటీవలి చిత్రాలలో తన విద్యలను ఏనాడూ ప్రదర్శించలేదు.

అయితే రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ లోకి అడుగుపెట్టానని పవన్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ విద్యలో కొత్త మెళకువలను అభ్యసిస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ సెషన్ నుండి ఒక ఫోటోను పోస్ట్ చేసారు. ఇది ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. ఈ ఒక్క ఫోటో అభిమానుల్లో వేవ్స్ క్రియేట్ చేసింది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరి హర వీర మల్లు సినిమాపై పూర్తిగా దృష్టి సారించిన పవన్ వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయనున్నారు.

ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లకముందే మరో రెండు ప్రాజెక్టులను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల ప్రకటించిన సుజీత్ యాక్షన్ ఎంటర్ టైనర్ సెట్స్ లో త్వరలో జాయిన్ కానున్నాడు. తదుపరి గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ తో కూడా పని చేయనున్నాడు.

అంతకంటే ముందే సురేందర్ రెడ్డితో సినిమా చేసే వీలు లేకపోలేదు. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఈ చిత్రం అతి త్వరలో ప్రారంభం కానుంది. హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ పూర్తి కాగానే రాబోవు ఎలక్షన్ పై పూర్తిగా దృష్టి సారిస్తారని భావిస్తున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఓం రౌత్ చేసిన తప్పు ఇదే..!
×