టీడీపీలో బీసీ బెడద.. ఎందుకింత ఖంగారు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో బీసీ బెడద పట్టుకుంది. ఇటీవల అధికార పార్టీ వైసీపీ నిర్వహించిన బీసీ సభ హిట్టయిందని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఫట్ అయిందని టీడీపీ అనుకూల మీడి యా సహా.. ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇది వైరుధ్యంతో కూడిన అంశం. అయితే ఇంతలోనే టీడీ పీలో ఒక కలవరం కనిపించడం చూస్తే.. బీసీల విషయంలో ఈ పార్టీ ఎందుకు ఇంతగా కలవరపడుతోంద నేదే ప్రశ్న.

మొదటి నుంచి కూడా తమ వెంటే బీసీలు ఉన్నారని టీడీపీ చెబుతోంది. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. అయితే..ఇప్పుడు తమ ఓటు బ్యాంకును వైసీపీ లాగేస్తోందనే ఆవేదన చింత టీడీపీలో కనిపిస్తోంది.

ఇది ఇప్పుడు సరైందేనా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ధైర్యంగా నిలబడాల్సిన సమయంలో అధైర్యానికి చోటిస్తున్నారనే చర్చసాగుతోంది. బీసీలు తమ వెంటే ఉన్నారని చెబుతున్నా.. ఎక్కడో తేడా వస్తోందన్న బాధ కనిపిస్తోంది.

ఇక వైసీపీకి కూడా బీసీలు ఇప్పుడు కావాలి. వారికి అనేక పథకాలు అమలు చేశామని నామినేటెడ్ పోస్టు లు ఇచ్చామని ఆ పార్టీ చెబుతోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు.. అనేక రూపాల్లో సాయం చేశామని బీసీ పిల్లలను చదివించామని.. టీడీపీ చెబుతోంది. ఈ రెండు పార్టీలు చేస్తున్న ప్రచారంలో తప్పులేదు. కానీ టీడీపీలోనే బెరుకు కనిపిస్తోంది. ఇది సరైన విధానం కాదనేది పరిశీలకుల ప్రశ్న. గత ప్రభుత్వంలో ఏం చేశారో .. చెప్పుకొంటే వారే నిర్ణయించుకుంటారు కదా! అనేది వీరి వాదన.

పైగా.. చేతులు కాలిపోయిన తర్వాత.. అన్నట్టుగా టీడీపీ వ్యవహారం ఉందనేది మరికొందరి వాదనగా ఉంది. బీసీ నేతలను గత ఎన్నికల తర్వాత వైసీపీ లాగేసుకుంది. ఆ సమయంలో వారిని బుజ్జగించో బామాలో పార్టీలో ఉంచాల్సిన అధిష్టానం పోతే పోనీ అన్నట్టుగా వ్యవహరించింది.

ఇప్పుడు వారే.. బీసీ సభను విజయవంతం చేశారనేది వైసీపీ టాక్. టీడీపీ వదులుకుంది.. మేం వారిని దరిచేర్చాం అని స్పష్టంగా చెప్పుకొంటున్నారు. ఇలాంటి విషయాల జోలికి టీడీపీ వెళ్లకుండా.. తాము ఏం చేశామనేది చెప్పుకొంటే.. ఎలాంటి బెడదా.. ఉండదని పరిశీలకులు అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఈసారి తోపులాటలో కింద పడిపోయారు.. షర్మిలకు ఇంకెన్ని కష్టాలో?
×