బాలయ్యకు ఇలాంటి టైటిలా?

నందమూరి బాలకృష్ణ త్వరలోనే మరొక సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. కామెడీ కమర్షియల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు 108వ సినిమా ఇటీవల అధికారికంగా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఇదివరకే వీరి కలయికలో రామారావు అనే సినిమా రాబోతున్నట్లు ఒక టాక్ అయితే వినిపించింది. అయితే ఆ కథ నచ్చకపోవడంతో బాలయ్య బాబు కోసం మరికొన్ని మార్పులు చేసి అదే మెయిన్ లైన్ తో అనిల్ రావిపూడి కథను డెవలప్ చేశాడు.

మొత్తానికి కథ నచ్చడంతో ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా కథకు తగ్గట్టుగా ఉండాలి అని దర్శకుడు ఆలోచిస్తున్నాడట. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఒక టైటిల్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 'బ్రో ఐ డోంట్ కేర్' అనే టైటిల్ ఫిక్స్ చేయాలి అని దర్శకుడు ఆలోచిస్తున్నాడట.

అయితే బాలయ్య బాబు నుంచి మాత్రం ఇంకా ఇలాంటి డిసిషన్ రాలేదని తెలుస్తోంది. ముందు షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత మధ్యలో మరో టైటిల్ ఏదైనా కరెక్ట్ గా అనిపిస్తే మారుద్దాం అని కూడా చెప్పారట. ఒకవేళ ఫైనల్ గా సినిమా షూటింగ్ కొత్త పూర్తయిన తర్వాత ఇదే కరెక్ట్ అనిపిస్తే ఫిక్స్ చేయాలని కూడా ఆయన తన నిర్ణయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు బాలయ్య బాబు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్ వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అందులో లెజెండ్ లయన్ డిక్టేటర్ డిస్కో కింగ్ టాప్ హీరో ఇలా చాలా సినిమాలు వచ్చాయి. అందులో సక్సెస్ అయినవి కూడా కొంత తక్కువగానే ఉన్నాయి. అయితే వాటికంటే కూడా 'బ్రో ఐ డోంట్ కేర్' అనే టైటిల్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది.

కంటెంట్ కూడా మొదట్లోనే టైటిల్ కు తగట్టుగా జనాలకు ఎక్కితే మాత్రం ఆ టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని చెప్పవచ్చు. అందుకే దర్శకుడు ఆ విధంగా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉండాలి. ఇక షూటింగ్ ను ఐదు లేదా ఆరు నెలల్లో పూర్తి చేసి వచ్చే ఎడాది సమ్మర్ అనంతరం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED కోలీవుడ్ కళ్ళన్ని ఈ సినిమాపైనే.. ఏమవుతుందో?
×