ఉచితాలు అక్కడ పనిచేయలేదు.. జగనో!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఏపీలో మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అధినేత సీఎం జగన్.. కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి రాజధాని పోలవరం రహదారులు పరిశ్రమలు ఉపాధి ఉద్యోగాల మాట ఎలా ఉన్నప్పటికీ.. అప్పులు చేసైనా తెచ్చి.. ఏపీలో ప్రజలకు డబ్బులు పంచుతున్నారు.

ఇదే తనను కాపాడేస్తుందని సీఎం జగన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇదే రాజమార్గమని కూడా అనుకుంటున్నారు. కానీ తాజాగా వెలువడిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని గమనిస్తే.. ఆ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధికి విజన్కు.. ఉపాధి ఉద్యోగాలకు మాత్రమే జైకొట్టారు. తాము ఇల్లు కదలకుండా అన్నీ చేసిపెడతామని.. చేతినిండా డబ్బులు కూడా ఇస్తామని హామీలపై హామీలు గుప్పించిన పార్టీలను అడ్రస్ లేకుండా చేశారు.

తాను ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుస్తున్నానని.. ఇప్పటి వరకు ఈ మూడేళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో వేశానని..సో.. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం జగన్ చెబుతున్నారు. అంతేకాదుతను చేస్తున్న సంక్షేమానికి  రాబోయే 30 ఏళ్లు తన ప్రభుత్వమే ఉంటుందని కూడా జగన్ చెబుతున్నారు.

ఇంత చేస్తున్న తనపైనా తన ప్రభుత్వంపైనా వ్యతిరేకత ఎందుకు ఉంటుంది?  ఉండాలని కూడా ప్రశ్నిస్తున్నారు. తన సంక్షేమమే తనను మరోసారి అధికారంలోకి తెస్తుందని కూడా ఆయన చెబుతున్నారు.  అయితే ఇంత చేస్తున్నాను.. అంత చేస్తున్నానని చెబుతున్న జగన్. ఏనాడూ రాష్ట్ర అభివృద్ధిని కానీ పారిశ్రామికంగా ఇది చేస్తున్నామని కానీ.. ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా గుజరాత్ ఫలితాన్ని తీసుకుంటే..   ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది తెలుస్తుంది.

గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రజలు అభివృద్ధి కోసం ఓట్లు వేశారని ఉచితాలకు కాదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది.  ప్రతి ఇంటికీ  200 యూనిట్ల ఉచిత విద్యుత్ 17 ఏళ్లు దాటిన మహిళలందరికీ 2000 రూపాయల మొత్తం అందించే పథకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అదనంగా పార్టీ ఉచిత సైకిళ్లు మరియు మోపెడ్లకు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఉచితాల జాబితానే ప్రకటించింది. అయినా.. ప్రజలు ఎవరూ కూడా దీనిని పట్టించుకోలేదు.

ఏపీలో జరుగుతున్న పాలన పట్ల ప్రజలు పూర్తిగా సంతోషంగా లేరనేది తెలిసిందే.  అధికార పార్టీకి కూడా ఇదే విషయం తెలిసినా ఎన్నికల ముందు ఇచ్చే ఉచితాలే తమకు విజయం చేకూరుస్తాయనే తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. ఈ వైఖరి మారితేనే  జగన్ మళ్లీ ఏపీలో అధికారం దక్కించుకునేదని.. లేకపోతే.. ఇంతటితో సరి! అని విశ్లేషకులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఢిల్లీ మహిళా కమిషన్ ఘటన పోలీసులను అవమానించేందుకే చేసింది
×