వెండితెర పై సింగర్ సునీత.... మహేశ్బాబ కు సోదరిగా?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో  మిల్క్‌బాయ్ ప్రిన్స్ మహేశ్‌బాబు హీరోత తెరకెక్కుతున్న తాజా చిత్రంగురించి రోజుకో ఆసక్తికర అంశాలు బయటకు వచ్చి అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా ద్వారా టాలీవుడ్లో టాప్ సింగర్‌గా వెలుగొందుతున్న సునీత తొలిసారి వెండితెరకు పరిచయమవుతున్నారట. తెలుగు చిత్రపరిశ్రమలో గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై యాంకర్‌గా వెలుగొందుతున్న ఆమె వెండితెరమీద కూడా నటిండానికి సిద్ధపడుతున్నారట.

మహేశ్‌బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తాజాగా తీస్తున్న చిత్రంలో ఆమె మహేశ్‌బాబుకు సోదరిగా నటించనున్నారని సమాచారం. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ ఆమెకు కథ కూడా చెప్పారట. ఆమె దాదాపుగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా కృష్ణానగర్ సర్కిళ్లలో ప్రచారం సాగుతోంది.

త్రివిక్రమ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచీ ప్రారంభంకానుంది ఎప్పటికి ముగుస్తుంది అనే దానిపైక ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించి రోజుకో విషయం బయటకు వచ్చి హీట్ పెంచుతోంది. త్రివిక్రమ్  ఇది వరకు ఒక కథను మహేశ్‌బాబుకు చెప్పి ఒక షెడ్యూలు కూడా పూర్తి చేశాక మహేశ్‌బాబుకు కథ నచ్చకపోవడంతో మరో కథ సిద్ధం చేసుకోవాల్సి వచ్చిందట. దీంతో త్రివిక్రమ్ మరో కథ కూడా సిద్ధం చేసుకుని సినిమాను పట్టాలకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం. దీనివల్ల ఆయన ముందు అనుకున్న తారాగణంలో కూడా పలు మార్పులు చేయాల్సి వస్తోందట.

అయితే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు ఆగిపోకుండా షూటింగ్ పట్టాలెక్కి ఐదు నెలల్లో ప్రొడక్షన్ చిత్రీకరణ పనులు పూర్తి చేయాలని త్రివిక్రమ్ కంకణం కట్టుకున్నారట. ప్రీప్రొడక్షన్ పనులు కూడా ఇదివరకే పూర్తి చేశారు. ఈ కొత్త కథకు తగ్గట్ల ఆయన నటీనటుల్లో కూడా కొన్ని మార్పులు చేస్తున్నారట. ఇందులో టాలీవుడ్లో టాప్ సింగర్ సునీత కూడా ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నారని లేటెస్ట్ బజ్.  

సింగర్ సునీతకు ఇదివరకు బుల్లితెరపై టాక్‌షోలు రియాల్టీ షోలు చేసిన అనుభవం ఉన్నప్పటికీ వెండితెరమీద మాత్రం నటించలేదు. సెల్యులాయిడ్ కెమెరా ముందుకు రావడం ఆమెకు ఇదే మొదటి సారి అవుతోంది. త్రివిక్రమ్ రూపొందించిన కథలో మహేశ్‌బాబుకు సోదరి పాత్ర కీలకంగా ఉండబోతోందట. ఈ పాత్ర చేయడానికి త్రివిక్రమ్ సింగర్ సునీతను సంప్రదించి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకోవడంతో ఆమె అంగీకరించారని భోగట్టా. అయితే ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియాలంటే దీనిపైన అధికారిక ప్రకటన రావాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×