PSPK: రీమేక్ వద్దంటే ఇలా బ్లాక్ చేస్తారా?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో డిమాండ్ ను బట్టి హీరోల రేంజ్ అలాగే మార్కెట్ వ్యాల్యూ కూడా చాలా వరకు మారిపోతున్నాయి. ట్రెండింగ్ అనేది ఇప్పుడు సినిమా ప్రపంచంలో ఒక తెలియని ఆయుధంలా మారింది అని చెప్పవచ్చు. అయితే స్టార్ హీరోల అభిమానులు కూడా ఏదైనా నచ్చకపోతే చాలా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. దీంతో వారి డిమాండ్ ను బట్టి కూడా హీరోలు దర్శకులు నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు.

ఏమాత్రం నెగటివ్ కామెంట్స్ వచ్చినా కూడా నిర్మాతలు సైతం వారి నిర్ణయాలకు విరుద్ధంగా వెళ్లడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ పై మాత్రం విరుద్ధంగానే నిర్ణయాలకు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసలే చాలా సీరియస్ గా ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వద్దని ఎంత మొత్తుకున్నా కూడా అసలు చిత్ర యూనిట్ స్పందించకపోవడం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు.

భవదియుడు భగత్ సింగ్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత మళ్లీ దాన్ని క్యాన్సల్ చేసుకొని తెరి రీమేక్ ను సెట్స్ పైకి తేవడం ఏమిటో అని ఆవేదన చెందుతున్నారు. అయితే ఆ రీమేక్ చేయవద్దని సోషల్ మీడియాలో హరిష్ శంకర్ ను ట్యాగ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అతను బ్లాక్ చేస్తూ ఉండడం మరింత వైరల్ గా మారుతుంది. దాదాపు ప్రతి అభిమాని కూడా రీమేక్ వద్దు బాబోయ్ అని ఎంతో గోల చేస్తున్నారు. కొందరైతే ఆఖరికి సూసైడ్ నోట్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడం వైరల్ గా మారింది.

అయితే హరీష్ శంకర్ మాత్రం తెరి రీమేక్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. గతంలో గబ్బర్ సింగ్ ను పవర్ఫుల్ గా రీమేక్ చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా రీమేక్ సినిమాలు చేస్తే మొదట ట్రోలింగ్ అయితే గట్టిగానే వస్తూ ఉంటుంది.

ఇక ఆ బాధ పడకూడదు అని అభిమానులు చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హరిష్ శంకర్ మాత్రం ఆ విధంగా ప్రశ్నించిన వారిని మాత్రం బ్లాక్ చేస్తున్నాడు. ఇదేంటి అని అడిగితే బ్లాక్ చేస్తున్నాడు ఏంటి అని మళ్ళీ సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై హరీష్ శంకర్ ఆలోచన విధానం ఏమిటో? ఎప్పుడు క్లారిటీ ఇస్తారో? చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×