న్యూ డిజైన్ లో నోరా మెలి తిప్పేస్తోందే!

బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా పటేహీ టెంప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టైలిష్ ఎంపికలతో పాటు...అంతే హాట్ గానూ సోషల్  మీడియాని వెడెక్కించడంలో చొరవ తీసుకుంటుంది. ఫ్యాషన్ ఎంపికల్లో ఎప్పటికప్పుడు ప్రత్యేకతని చాటుతుంది. తాజాగా మరోసారి స్టైల్ కా బాప్ అనిపించే ఫోటోతో  నెటి జనుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా డిజైన్డ్ దుస్తుల్లో అమ్మడి  మురిపాలు చూస్తుంటే? ఖంగు తినాల్సిందే.

పలుచని పొరలాంటి దుస్తుల్లో దూరిపోయిన అమ్మడు శరీమంతా ఓపెన్ గానే. సింగిల్ పీస్ లో ఇలాంటి ఆవిష్కరణ ఇదే తొలిసారి.  వెండి డిజైన్ లో అమ్మడు మెరిసిపోతున్న వైనానికి ఎంతటి వారైనా మంత్ర ముగ్దులు  కాక తప్పదు.  గ్లామర్ ఎలివేషన్ మించి మనోహరి ఫోకస్ అవుతుంది. థై షో..క్లీవేజ్...స్కిన్ షోది ఏమంది?  నేను వేసుకున్న దుస్తుల్ని నిశితంగా పరిశీలించండని ఇలా ముస్తాబైంది.

కారులో నుంచి వొంగి దిగుతూ ఇలా  కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానుల వేడెక్కించే కామెంట్లకు  అదుపు లేదు. ఎవరి  స్టైల్లో  వారు చెలరేగుతున్నారు. ఇక నోరా కెరీర్ సంగతి చూస్తే ఈ ఏడాది అమ్మడు థాంక్ గాడ్..యాన్ యాక్షన్ హీరో చిత్రాలతో ప్రేక్షకు లముందుకొచ్చింది. రెండు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో విఫలమయ్యాయి.

ప్రస్తుతం `100 పర్సంట్` చిత్రంలో నటిస్తోంది. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక కొత్త ఛాన్సులేవి చేతిలో లేవు. కొన్ని టీవీ షోస్ ని హోస్ట్ చేస్తుంది. సుకేష్ చంద్ర  200 కోట్ల కుంభకోణంలో కేసులో నోరా  ఆరోపణలు ఎదుర్కుంటోన్న నేపథ్యంలో వచ్చే అవకాశాలు కూడా రావడం లేదు. ఇది అమ్మడి కెరీర్ పై ఓ మచ్చగా పడింది. ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.  ఆమెకు తోడుగా జాక్వెలిన్  పెర్నాండేజ్ కూడా ఉంది. ఇద్దరికి సుకేష్ తో సన్నిహిత సంబంధాలు కారణంగా కేసులో కీలకంగా మారారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×