SSMB 28: స్టార్ట్ అయ్యేది అప్పుడే.. రిలీజ్ ప్లాన్ కూడా రెడీ!

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 28 ప్రాజెక్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అసలైతే మొదట అనుకున్న కథను క్యాన్సిల్ చేసుకుని మరొక కథను సెట్స్ పైకి తీసుకువస్తున్నారు. త్రివిక్రమ్ పూర్తిస్థాయిలో మళ్లీ మరొక స్క్రిప్టు మొత్తం కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ను ఈ వారంలోని మొదలు పెట్టాల్సింది. కానీ మహేష్ కొంత గ్యాప్ తీసుకోవాల్సి రావడంతో వాయిదా పడింది.

ఇక ఫైనల్ గా ఈ ప్రాజెక్టును డిసెంబర్ 15 లేదా 16వ తేదీన మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. అయితే వచ్చే వారం ముందుగానే పూజ హెగ్డే ముంబై నుంచి హైదరాబాద్ కు రానుంది.

ఆమె 14వ తేదీన చిత్ర యూనిట్ తో మీటింగ్ కు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కుదిరితే 15 లేదా 16వ తేదీన మంచి ముహూర్తాన ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక మొత్తానికి మహేష్ బాబు 28వ సినిమా అయితే స్టార్ట్ కానుంది అని సోషల్ మీడియాలో కూడా హడావిడి మొదలైంది.

ఇక ఈ సినిమా షూటింగ్ త్రివిక్రమ్ ఐదు నెలల లోనే పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాడు. ఇక మరొక నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి మొత్తానికి సినిమాను 2023 ఆగస్టులో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

మొదట అనుకున్న కథ షూటింగ్ ఇప్పటివరకు కొంత పూర్తయి ఉంటే ఆ సినిమాను 2023 మార్చిలో లేదా ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఒక డేట్ కూడా అనుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్ క్యాన్సిల్ కావడంతో పాటు మరొక కొత్త కథ సెట్స్ పైకి రావడంతో ప్లాన్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. దీంతో SSMB 28వ సినిమాను 2023 ఆగస్టులో గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా స్క్రిప్ట్ కూడా ఇంకా ఫినిష్ కాలేదు. కాబట్టి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా వచ్చే ఏడాది త్రివిక్రమ్ సినిమా తర్వాత మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×