సానియా మీర్జాతో విడాకులపై స్పందించిన షోయాబ్ మాలిక్

ఇండియా పాకిస్తాన్ లకు చెందిన ప్రముఖ క్రీడా జంట షోయబ్ మాలిక్ - సానియా మీర్జా  విడాకులపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరూ కలిసి చేస్తున్న రియాలిటీ టాక్ షో లో వీరి విడాకుల పుకార్లపై ఇద్దరూ స్పందించలేదు. దీంతో ఈ జంట తమ విడిపోవడం ఖామయని..అందుకే పెదవి విప్పలేదని.. చట్టపరమైన సమస్యల కారణంగా అధికారికంగా స్పందించలేదని అనుకున్నారు.

చివరకు వారి విడాకుల గురించి మీడియాలో వార్తలు ఎక్కువ కావడంతో మౌనం వీడిన షోయబ్ మాలిక్ ఒక న్యూస్ పోర్టల్తో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.  ఇది తమ వ్యక్తిగత విషయమని.. దానిని ఒంటరిగా వదిలేయాలని అన్నారు. సానియా -తాను విడిపోవడంపై ఎలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోమని కూడా అతను చెప్పాడు.

ఈ జంట తమ విడాకులను ప్రకటించలేకపోతున్నారని నివేదించబడింది. ఎందుకంటే వారు కొన్ని వృత్తిపరమైన కట్టుబాట్లను కలిసి మూటగట్టుకోవాల్సిన చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో వారి ఓటీటీ షో 'ది మీర్జా మాలిక్ షో' కూడా ఉంది.

సానియా మీర్జా -షోయబ్ మాలిక్ ఐదు నెలల పాటు డేటింగ్ తర్వాత 2010లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అక్టోబర్ 30 2018న  ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు కూడా  జన్మించాడు.

వీరి విడాకుల పుకార్లు ముఖ్యాంశాలలోకి వచ్చిన వెంటనే షోయబ్ పాకిస్థానీ నటి అయేషా ఒమర్ తో ప్రేమలో ఉన్నట్లు నివేదించబడింది. అయితే ఈ పుకార్లపై స్పందించిన అయేషా షోయబ్ తన భార్యతో సంతోషంగా ఉన్నాడని.. వారి జంటను గౌరవిస్తానని సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. తాను క్రికెటర్కి మంచి స్నేహితురాలని మాత్రమేనని అయేషా పేర్కొంది.

కానీ ఇప్పటికీ అధికారికంగా షోయాబ్-సానియా విడిపోలేదు. ఈ వార్తలపై క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. అడిగిన ప్రతీసారి దాటవేస్తుండడంతో అందరికీ డౌట్ కొడుతోంది. 
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×