మ్యాకప్ లేకుండా హీరోయిన్ గా కమల్ మాజీ భార్య!

కమల్ హాసన్ మాజీ భార్య...శ్రుతిహాసన్ తల్లి సారిక ఒకప్పటి నటి అన్న సంగతి తెలిసిందే. 80..90 కాలంలో ఎన్నో సినిమాల్లో నటించారు. బాలీవుడ్ లో సారిక చాలా సినిమాల్లో నటించారు.  దాదాపు 2010 వరకూ ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో పెద్దగా కనిపించలేదు. అయినా అడపాదడపా తెరపై కనిపించారు. ఈ ఏడాది సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో 'ఉంఛాయి' సినిమాలో నటించారు.

ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఉంఛాయి ప్రమోషన్ లోనూ ఆమె యాక్టివ్ గా పాల్గొంటు న్నారు. తాజాగా సారిక 1979 లో నటించిన 'గృహ  ప్రవేశ్' సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ఆ సినిమాలో సారిక ఎలాంటి మ్యాకప్ లేకుండా సహజ సౌందర్యంతోనే నటించినట్లు  తెలిపారు. మ్యాకప్ వేసుకోవడం తనకు ఇష్టం లేక నేచురల్ గానే నటించాలని ఆమెతో పాటు దర్శకుడు కూడా  ప్రోత్సహించడంతో అలాగే నటించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కొందరు సీనియర్ నటులు సారిక వద్దకు వచ్చి ఇదేంటి?  మ్యాకప్  లేకుండా నటిస్తున్నావ్?  బ్యాంక్ కోబింగ్ చేయలేదు..ముఖానికి మ్యాకప్ లేదు. హీరోయిన్లు ఇలా  ఉండకూడదంటూ సలహాలిచ్చారుట.

కానీ వాటిని సారిక పట్టించుకో కుండా సహజ అందంతోనే ఆ సినిమాలో నటించినట్లు  తెలిపారు.  ఈ చిత్రంలో సంజీవ్ కుమార్ హీరోగా నటించగా.. షర్మిలా ఠాగూర్..సారికా హీరోయిన్లగా నటించారు. సారిక సెకెండ్ లీడ్ పోషించారు. బసు భట్టచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మరి సారిక సెకెండ్ ఇన్నింగ్స్ లోనైనా తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఉంటుందేమో చూడాలి. హీరోయిన్ గా కొనసాగినంత కాలం హిందీ సినిమాలు చేసారు. అప్పటి హిందీ సినిమాల క్రేజ్ నేపథ్యంలో ముంబై దాటి రాలేదు. మరి తాజాగా తెలుగు సినిమా పాన్ ఇండియా చేరిన వేళ...హిందీ హీరోలంతా తెలుగు వైపు చూస్తోన్న నేపథ్యంలో  సారిక ఆ రకమైన ప్రయత్నాలు ఏవైనా చేస్తారా? అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED కోలీవుడ్ కళ్ళన్ని ఈ సినిమాపైనే.. ఏమవుతుందో?
×