పూనకాలు లోడింగ్...మాస్ ఈజ్ కమింగ్!

'వాల్తేరు వీరయ్య' లో మాస్ మహారాజా రవితేజ  కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. వీరయ్య(చిరంజీవి) సవతి సోదరుడి పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రల మధ్య బలమైన ఎమోషన్ పండుతుందని ఇప్పటికే లీక్ అయింది. తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తూ ఆ రెండు పాత్రల్ని  సెంటిమెంట్ గా  డిజైన్ చేసారు. దీంతో మాస్ రాజా తెరపై ఎలా కనిపించనున్నాడు? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

ఆయన హీరోగా నటించే సినిమాల్లో మాస్ రాజా బిరుదుకు తగ్గట్టే క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తారు. మరి చిరంజీవి సినిమాలో రవితేజని అంత పవర్ ఫుల్ గా చూపిస్తారా?  లేదా? అని ఓ సెక్షన్ ఆడియన్స్ లో సందేహం ఉంది. తాజాగా వాటన్నింటికి తెర దించుతూ దర్శకుడు బాబి టీజర్ సహా రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్  రిలీజ్ తేదిని  కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు.

 మాస్ రాజా మాస్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఆ పాత్రని తీర్చిదిద్దుతున్నట్లు ఈ శాంపిల్  పోస్టర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇదిగో ఇక్కడిలా గొడ్డలి..గ్యాస్ బండతో ప్రత్యర్ధులపై తెగ బడటానికి సిద్దమైనట్లు కనిపిస్తున్నాడు. గుండె లోతులోకి కత్తి దిగినా... గోడ్డలి కి గ్యాస్ బండని తగిలించి ఈడ్చూ కొచ్చి మరి ప్రత్యర్ధుల భరతం పట్టినట్లున్నాడు. ఈ శాంపిల్ పోస్టర్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తుంది.

పోస్టర్ పై  పూనకాలు లోడింగ్... మాస్ ఈజ్ కమింగ్ అంటూ డిసెంబర్ 12వ తేది ఉదయం 11.7 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ రవితేజ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. శాంపిల్ పోస్టర్లోనే ఇంత పవర్ ఫుల్ గా ఉన్నాడంటే ?  12వ తేదిన ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే రాజాని ఇంకే రేంజ్ లో ఎలివేట్ చేస్తారో? అంటూ ఎగ్జైట్ మెంట్ కి గురవుతున్నారు.

ఇప్పటికే వీరయ్య మాస్ లుక్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. లిరికల్ సింగిల్స్  ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి తెస్తున్నారు. ఇంతలో మాస్ రాజా లుక్ ని రివీల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తుండగా...మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం యూరప్ లో చిరు-శ్రుతి హాసన్ లపై ఓ పాట షూటింగ్ చేస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసి జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఆ మహిళ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
×