క్రికెటర్ కె.ఎల్ రాహుల్- ఆథియా పెళ్లికి ఏర్పాట్లు

క్రికెటర్ కెఎల్ రాహులా - అతియా శెట్టి వివాహం ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ప్రముఖుల అభిమానులు గ్రాండ్ వేడుకను చూసేందుకు వేచి ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఇటీవల అతియా - కెఎల్ రాహుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ధృవీకరించారు.

ధారావి బ్యాంక్ లాంచ్ ఈవెంట్ లో కెఎల్ రాహుల్ తో అతియా శెట్టితో వివాహం ఎప్పుడు అని విలేకరులు సునీల్ శెట్టిని అడిగారు. సునీల్ శెట్టి ``జల్దీ హోగీ``(త్వరలోనే అవుతుంది) అని సమాధానమిచ్చాడు. ఈ జంట గత మూడు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నార. అయితే వారు కొన్ని నెలల క్రితమే తమ సంబంధాన్ని ఇన్స్టా వేదికగాఅఫీషియల్గా చేసుకున్నారు.

ఈ జంట తమ సంబంధంపై వచ్చిన కథనాలను ఆస్వాధిస్తారు. పబ్లిక్ PDA -ఇన్ స్టా లవ్ నుండి దూరంగా ఉండరు. అంతకుముందు అతియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన పెళ్లి గురించిన పుకార్లను విని సింపుల్ గా నవ్వేసింది. అందులో ఒక గమనికను పంచుకుంది: `3 నెలల్లో జరిగే ఈ వివాహానికి నన్ను ఆహ్వానిస్తానని నేను ఆశిస్తున్నాను`` అంటూ పంచ్  విసిరారు

తాజా కథనాల ప్రకారం.. KL రాహుల్ - అతియా శెట్టి 5-నక్షత్రాల హోటల్ లో పెద్ద ఫ్యాన్సీ వివాహాన్ని ప్లాన్ చేయడం సరికాదని  నిర్ణయించుకున్నారు. బదులుగా వారు ఖండాలాలోని సునీల్ శెట్టి నివాసం `జహాన్`లో వివాహం చేసుకోబోతున్నారు. నటుడి ఇంట్లో అలంకరణలు ఇతర ఏర్పాట్లను పూర్తి చేయడానికి ప్రముఖ వివాహ నిర్వాహకుడు కసరత్తు చేస్తూ కనిపించినట్లు సమాచారం.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED నెట్టింట ఫ్యాన్ వార్...పవన్ కు టైమ్ లేదట..!
×