అలియాభట్ పై సందేహంతోనే గూగుల్ లో శోధిస్తున్నారా?

రణబీర్ కపూర్-అలియాభట్ దంపతులు  పెళ్లైనా ఏడాదే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కపూర్ కుటుంబ సబ్యులు ఎంతో ఆనందిస్తున్నారు. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ సంబురాలు చేసుకుంటున్నారు. ఇక అలియాభట్ కూడా ప్రసవం నుంచి త్వరగానే కోలుకున్నారు.  బిడ్డ జన్మించకముందు కొన్ని రోజులు దూరంగా ఉన్నప్పటికీ జననం అనంతరం పెద్దగా విశ్రాంతి తీసుకోలేదు.

కొద్ది  రోజులకే స్మార్ట్ ఫోన్ చేత బట్టి అభిమానులకు టచ్ లోకి వచ్చేసారు. ఈ సందర్భంగానే  బిడ్డ పేరుగా కొన్ని సంకేతాలు పాస్ చేసారు. తమ గారాల పట్టికి 'రాహా' గా నామకరణం చేసారు.  అలాగే 'రాహా' అంటే దానికి పరిపూర్ణ అర్ధం కూడా వివరించారు. రాహా అనే పేరు దాని స్వచ్ఛమైన రూపంలో దైవిక మార్గం అని అర్థం. స్వాహిలిలో ఆనందం అని అర్థం.

సంస్కృతంలో రాహా అనేది ఒక వంశం.. బంగ్లాలో - విశ్రాంతి.. సౌలభ్యం.. ఉపశమనం అని మీనింగ్ వస్తుంది. అలాగే  అరబిక్ లో  శాంతి..  ఆనందం.. స్వేచ్ఛ అని కూడా వస్తుంది.

ఇలా  ఇన్ని మీనింగ్ లు అలియా చెప్పడంతో నెటి జనులకు సందేహం వచ్చింది. ఇవన్నీ  నిజమేనా?  లేక కుమార్తె పుట్టిన ఎగ్టైట్ మెంట్ లో అన్ని మీనింగ్ లు కలిపి చెప్పేస్తుందా? అని గూగుల్ లో శోధించడం మొదలు పెట్టారు.

రాహా అనే పదానికి ఇంకెన్ని పర్యాయ పదాలున్నాయి. ఇదే పేరుని ఇంకెన్ని రకాలుగా పలుస్తారు?  రాహా అంటే  ఏ దైవం పేరు?  ఇలా అన్ని రకాలుగా నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. మరి వీళ్ల రీసెర్చ్ లో ఏమని తెలుస్తుందో చూడాలి.

అయితే ఈ విషయంలో రణబీర్ కపూర్  ప్రవేశించలేదు. నెట్టింట ఇంత రచ్చ జరుగుతోన్నా ఆయన మాత్రం ఎంచక్కా?  తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED నెట్టింట ఫ్యాన్ వార్...పవన్ కు టైమ్ లేదట..!
×