బర్గర్ విత్ బగ్గర్స్ ..ఇది అతి పెద్ద బూతా కియారా?

#RC15 టీమ్ ఇటీవలే  న్యూజిలాండ్ షిప్ట్ అయిన సంగతి తెలిసిందే.  పాటల షూట్లో భాగంగా యూనిట్ ద్వీప దేశంలో మాం వేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..అందాల నాయిక కియారా అద్వానీపై పాటలు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు శంకర్ మరియు కొరియోగ్రాఫర్ బోస్కో-సీజర్ విలాసవంతమైన స్థాయిలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. శంకర్ మార్క్ సాంగ్ గా సినిమాలో పాటని హైలైట్ చేయబోతన్నారు.

అందుకే ప్రత్యేకంగా శంకర్ దగ్గరుండి మరి షూట్  నిర్వహిస్తున్నారు. ఈ పాట కోసం భారీగానే వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.  పాటలో భారీతనం కనిపించడం ఖాయం. సినిమాలో ఈపాట హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  తాజాగా ఆన్సెట్స్  నుంచి కియారా రెండు ఫోటోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

అందులో ఒక ఫోటోలో కియారా...చరణ్   అల్పాహారం కోసం బర్గర్లు  పంటికింద పెట్టి కొరుకుతున్నట్లు కనిపిస్తుంది.  ఆపై హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ ఆలిమ్ మరియు కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్లతో సహా మొత్తం సిబ్బంది ఉన్న మరొక చిత్రాన్ని పంచుకుంది. అయితే వీటి మధ్య చిన్న వ్యత్యాసం చూపించింది. ఆ రెండు ఫోటోల్ని ఉద్దేశించి  ఇంట్రెస్టింగ్  కామెంట్ ఒకటి  పోస్ట్ చేసింది.

కియారా అద్వానీ తన కామెంట్లో  బర్గర్స్ కి బధులుగా 'బగ్గర్స్' అనే పదాన్ని ఉపయోగించింది. సాధారణ UK ఆంగ్ల పరిభాషలో  బగ్గర్ అనేది పురుషులను పిలవడానికి ఉపయోగించే అసభ్య పదం.  

దీన్ని  ఎవరినైనా తిట్టడానికి మాత్రమే ఉపయోగించ బడుతుంది. మరి కియారా తెలిసి ఆ పదాన్నివినియోగించిదా?  తెలియక వినియోగించిందా?  అన్నది ఆ పెరమాళ్లకే  ఎరుక.

ఆ పదం మీనింగ్ తెలిసిన వాళ్లు మాత్రం కామెంట్లు తమదైన శైలిలో గుప్పిస్తున్నారు. ఇక షూట్ కి సంబంధించి ఇప్పటికే  సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసినట్లు   సమాచారం. ఈ నేపథ్యంలో శంకర్ విదేశీ షెడ్యూల్ లో పాటల షూట్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది.  వాటి తర్వాత మళ్లీ యధావిధిగా టాకీ పార్ట్ కొనసాగుతుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED నెట్టింట ఫ్యాన్ వార్...పవన్ కు టైమ్ లేదట..!
×