NTR30 అలాంటి బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా..?

యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా NTR30. 'ఆర్.ఆర్.ఆర్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అలానే కొరటాల అండ్ టీమ్ లొకేషన్స్ వేట సాగిస్తున్నారు.

అయితే NTR30 అనేది వాటర్ బేస్డ్ మూవీ అని టాక్ నడుస్తోంది. ఇప్పటికే 'ఫ్యూరీ ఆఫ్ #NTR30' పేరుతో విడుదలైన మోషన్ పోస్టర్ లో నీళ్లను ప్రధానంగా చూపించిన సంగతి తెలిసిందే. సముద్ర తీరాన పడవల మధ్యలో ఒక చేత్తో గొడ్డలి మరో చేత్తో కత్తి పట్టుకొని ఉన్న తారక్ బ్యాక్ సైడ్ లుక్ కి రివీల్ చేసారు.

'అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా..' అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇప్పుడు ఓ భారీ వాటర్ ఫైట్ ఎపిసోడ్ తో షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం టీం లొకేషన్స్ వెతికే పనిలో నిమగ్నమై ఉన్నారని అంటున్నారు. మరోవైపు ఇతర ప్రధాన పాత్రల కోసం నటీనటులను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

NTR30 సినిమాలో హీరోయిన్ రోజుకొకరి పేరు తెరపైకి వస్తోంది. ఇప్పుడు జాన్వీ కపూర్ లేదా మృణాల్ ఠాకూర్ ని తీసుకోనున్నారని నివేదికలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందేమో చూడాలి.

ఇదొక పాన్ ఇండియా చిత్రం. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేస్తారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయనున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ - హరికృష్ణ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ - కొరటాల కాంబినేషన్ లో రానున్న #NTR30 ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED నెట్టింట ఫ్యాన్ వార్...పవన్ కు టైమ్ లేదట..!
×