వైరల్ పిక్: శోభితతో చైతన్య డేటింగ్ రూమర్స్ నిజమేనా..?

అక్కినేని నాగ చైతన్య తన మాజీ భార్య సమంతతో విడిపోయినప్పటి నుంచి అతని పర్సనల్ లైఫ్ మీద అనేక రూమర్స్ వస్తున్నాయి. 'మేజర్' బ్యూటీ శోభితా దూళిపాళ్లతో చైతన్య డేటింగ్ లో ఉన్నట్లు గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

చైతూ - శోభిత రిలేషన్ షిప్ లో ఉన్నారని.. ఇద్దరూ తరచుగా కలుస్తున్నారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దీని గురించి అటు చైతన్య కానీ ఇటు శోభిత కానీ ఎప్పుడూ స్పందించలేదు. వీరిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారనడానికి ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో ఇవన్నీ గాలి వార్తలే అని అభిమానులు నిర్ధారణకు వచ్చారు.

అయితే ఇప్పుడు నాగచైతన్య - శోభిత కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో వీరిద్దరూ క్యాజువల్ దుస్తుల్లో పక్క పక్కన నిలబడి కనిపించారు. ఇది చూసిన నెటిజన్లు హీరో హీరోయిన్ల మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని నిర్ధారించుకోవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఆ ఫోటోని మనం నిశితంగా గమనించినట్లైతే.. అది ఎడిట్ చేసిన పిక్ అని అర్థం అవుతుంది. ఇద్దరినీ కట్ చేసి పక్క పక్కన చేర్చినట్లు స్పష్టమవుతుంది. కాకపోతే బ్యాగ్రౌండ్ చూస్తే వీరు ఒకే ప్లేస్ లో దిగిన ఫోటోలా కనిపిస్తోందని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వేర్వేరు ఫోటోలను ఒకచోట చేర్చి ఎడిట్ చేసినప్పటికీ.. బ్యాగ్రౌండ్ చూస్తుంటే చై - శోభిత ఒకే ప్లేస్ లో దిగిన ఫొటోలా అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇది ఎడిటెడ్ పిక్ అయినప్పటికీ.. ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. ఓ నెటిజన్ ఈ ఫోటోని ట్యాగ్ చేస్తూ చైతన్యకి బర్త్ డే విషెస్ చెప్పడం గమనార్హం.

సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య డేటింగ్ పుకార్లు రావడం.. ఊహాగానాలు వినిపించడం సర్వసాధారణమే. ఇప్పుడు చైతన్య - శోభిత గురించి కూడా అలాంటి రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై వీరు స్వయంగా మాట్లాడే వరకు నిర్ధారణకు రాలేము.

నిజానికి 'లాల్ సింగ్ చడ్డా' మూవీ ప్రమోషన్స్ తో చైతూ తన రిలేషన్షిప్ స్టేటస్ గురించిన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ప్రెజెంట్ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? అని అడగ్గా.. నవ్వి సమాధానం దాటవేశారు. ఆ నవ్వుకి అర్థం ఏమిటి? హ్యాపీగా ఉన్నారా? అని అడగ్గా.. 'హా.. హ్యాపీ స్టేటస్' అని బదులిచ్చారు చై.

అలానే మరో ఇంటర్వ్యూలో 'శోభిత ధూళిపాళ్ల పేరు వినగానే ఏం గుర్తొస్తుంది?' అని అడగ్గా.. నాగ చైతన్య చిన్న స్మైల్ ఇచ్చారు. జస్ట్ నవ్వుతానని బదులిచ్చారు. దీంతో పరోక్షంగా చైతూ తన డేటింగ్ రూమర్స్ ని కంఫర్మ్ చేసారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే ఫ్యాన్స్ మాత్రం చై అలాంటి వాటిపై స్పందించనని సింపుల్ గా నవ్వుతో చెప్పేసాడని అన్నారు. ఇప్పుడు ఎడిట్ పిక్ కారణంగా చైతూ - శోభిత డేటింగ్ గురించి మరోసారి రూమర్స్ వచ్చాయి. మరి దీనిపై వీరిద్దరూ స్పందిస్తారేమో చూడాలి.
× RELATED నెట్టింట ఫ్యాన్ వార్...పవన్ కు టైమ్ లేదట..!
×