మంత్రి జోగి కామెంట్స్.. ఇక మూడుకు ఎంత మంది ఓకేనో.. తేలిపోతుందేమో!!

ఏపీలో మూడు రాజధానుల  ఏర్పాటు మాట అటుంచితే.. అసలు ఈ వాదననే హైకోర్టు పట్టించుకోవడం లేదు. పైగా.. రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా ఉంచాలని ఇటీవల తేల్చి చెప్పింది. అయితే.. ఈ విషయాన్ని పక్కన పెట్టిన ఏపీ సర్కారు.. ఎవరు ఏమంటే.. మనకెందుకు.. అన్నట్టుగా.. మూడు రాజధానులకే మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే.. రైతులు చేస్తున్న పాదయాత్ర పై తీవ్రస్తాయిలో విరుచుకుపడుతున్నారు. అయినా.. రైతులు కొండంత గుండె ధైర్యంతో మహాపాదయాత్ర 2.0 ను ముందుకు తీసుకువెళ్తున్నారు.

అయినా.. కూడా.. మంత్రులు.. నాయకులు తమ దూకుడు ఎక్కడా తగ్గించడం లేదు. కాకినాడ దిశగా సాగుతున్న రైతుల మహాపాదయాత్ర 2.0ను అడ్డుకోవాలని.. సాక్షాత్తూ.. మంత్రి బొత్స సత్యనారాయణ   ప్రజలకు పిలుపునిచ్చారు. నిజానికి మంత్రిగా బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఆయన అలా వ్యవహరించడం.. వివాదానికి దారితీసింది. అయినా.. ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇక  వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదే రేంజ్లో వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై ఎమ్మెల్సీ దువ్వాడ ఘాటుగా స్పందించారు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర నిర్వహించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.  పాదయాత్ర చేస్తున్న వారు అసలు రైతులే కాదని.. వారంతా పెయిడ్ ఆర్టిస్టులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా యాత్రలు చేస్తే సహించేదిలేదన్నారు.

ఇక ఇప్పుడు మరో మంత్రి ఏకంగా.. గతంలో చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన.. నాయకుడు.. జోగి రమేష్ పార్టీ నాయకులు.. కార్యకర్తలకు ఆసక్తికర పిలుపునిచ్చారు. జగన్ లక్ష్యం.. పాలన వికేంద్రీకరణ విజయవంతం అయ్యేలా.. దసరా రోజు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయించాలని.. ఆయన సూచించారు.

ప్రతి ఆలయంలోనూ.. పూజలు మార్మోగాలని కూడా ఆయన చెప్పారు. వికేంద్రీకరణకు మద్దతిచ్చే సంస్థలు వ్యక్తులు.. పార్టీలు కూడా కలిసి రావాలని.. ఆయన కోరడం.. గమనార్హం. మరి ఈ ప్రకటనతో.. మూడుకు ఎంత మంది మద్దతిస్తారో తేలిపోతుందేమో.. చూడాలి! అంటున్నారు మేధావులు.
 
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

× RELATED నాన్నా పులి.. ఇదేనా బాబు రాజకీయం..!
×