రూపం మారడం వెనుక హీరోయిన్ నాన్ వెజ్ స్టోరీ!

బేసిక్ గానే మలయాళీ బ్యూటీలు నాన్ వెజ్ ప్రియులంటారు. కొబ్బరి నూనే వంటకాలు అయినా అందులో నాన్ వెజ్ పీస్ పడిదంటే?  భామా మణులు జుర్రేయడం  పరిపాటే. ఈ విషయాన్ని స్వయంగా ఒక మలయాళీ హీరోయిన్ గతం లో ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా చెబుతూ అమ్మడు నాన్ వెజ్ వంటకాలు ఎంత ఇష్టంగా లాగించేసిందో?  తెలిసిందే.

ఆ సందర్భంలోనే మావాళ్లు అందరికీ చికెన్ పీస్ లు..మటన్ పీస్ లు అంటే భలే ఇష్టం అని చెప్పేసింది. అప్పటివరకూ తెలుగింట వెజ్ వంటకాలు రుచి చూసిన అమ్మడు ముందుకు ఒక్కసారిగా మటన్ కర్రీ ఘుమ ఘుమలాడేసరికి నోటికి ఓ రేంజ్ లో పనిచెప్పింది. ముద్ద లేనిదే ముక్క దిగదని డైరెక్ట్ గానే  చెప్పింది. ఆ రకంగా మలయాళీ బ్యూటీల నాన్ వెజ్ సీక్రెట్ గుట్టు రట్టయింది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే నాన్ వెజ్ ముందుకొచ్చేసరికి  మడతపెట్టేయడం ఖాయమని ఖారారైంది.

ఇప్పుడీ కథ దేనికంటారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ఇటీవలే ఓ మలయాళం హీరోయిన్ బాగా బొద్దుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్యాంట్..షర్ట్ వేసుకుని డాన్స్ చేసిన వీడియోలో ఆ అమ్మడు బాగా వెయిట్ పెరిగినట్లు కనిపించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇంతలావైందేంటి?  ఏంతింటుంది? ఎంత తింటుంది? ఎలా తింటుంది? అనే అంశాలు చర్చకొచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు సంగతి బయటకు వచ్చింది. ఆమె కూడా నాన్ వెజ్ ప్రియురాలేనంట. ముక్కలేనిదే ముద్ద దిగని బ్యాచ్ అంట. ఉదయం టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకూ ప్రతీ ఐటమ్ లోనూ నాన్ వె జ్ కర్రీస్ ఉండాలిట. ఇది రెగ్యులర్ హ్యాబిట్ అట.

ఇక కోవిడ్ ప్రారంభంతో పూర్తిగా ఫిట్ నెస్ కి దూరంగా ఉంటూ పుడ్డీగానే మారిపోయిందిట. వీకెండ్ లో స్నేహితులతో పబ్ లో పార్టీలు...వెకేషన్లు ఇలా సమయాన్ని గడిపిందిట. ఈ క్రమంలో ఫిట్ నెస్ పై పూర్తిగా అశ్రద్ధ వహించడంతో రూపంలో భారీ మార్పులొచ్చినట్లు  తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని నెలలకి వెయిట్ చూసుకునే సరికి భారీగా పెరిగినట్లు గ్రహించిందట.

పొరపాటు అలవాటుగా మారిపోతే ఎలా ఉంటుందన్నది అప్పుడే గ్రహించిందిట. ఒక అలవాటు అన్నది ఎంతగా మార్చేస్తుందన్నది అమ్మడు అప్పుడే పుర్రెకి తట్టిందిట. ఆ వెంటనే ఫ్యాట్ ని కరిగించే ప్రయత్నాలు మొదలు పెట్టిందిట. నిజానికి ఆ వీడియోలో కంటే ఇంకా అధిక బరువు కల్గి ఉండేదని...డైట్..వర్కౌట్ మొదలు పెట్టినప్పటి నుంచి నెట్టింట కనిపించడం మొదలు పెట్టిందని తాజాగా లీకులందుతున్నాయి.

ప్రస్తుతం పూర్తిగా డైట్ లోకి వచ్చేసిందిట. న్యూట్రిషన్ సలహాలతో డైట్ తీసుకుంటోందిట. మరి ఇంతటి నాన్ వెజ్ ప్రియురాలు ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. డార్లింగ్ అమ్మడిని నాన్ వెజ్ లో ముంచి తేల్చేయడు.  ఇద్దరు నాన్ వెజ్ ప్రియుల కలిస్తే అక్కడ రచ్చ రచ్చేగా. అదండి ఆ బ్యూటీ నాన్ వెజ్ కహానీ.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED 2023 సంక్రాంతి ఫైట్.. రిలీజ్ డేట్స్ ఫిక్స్!
×