త్రివిక్రముడితో బన్నీ అక్కడ మొదలు పెట్టాడు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఫుష్ప'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయాడు. దీంతో దేశ వ్యాప్తంగా హ్యూజ్ క్రేజ్ ని దక్కించుకున్నాడు.

అదే క్రేజ్ కారణంగా ప్రముఖ టాప్ బ్రాండ్ లు ఇప్పడు బన్నీ వెంట పడుతున్నాయి. క్రేజ్ వుండగానే ఇల్లు చక్క బెట్టుకున్నట్టుగా బన్నీ తన పాన్ ఇండియా క్రేజ్ ని ప్రస్తుతం క్యాష్ చేసుకుంటూ వరుస బ్రాండ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.

ఇప్పటికే రెడ్ బస్ నుంచి జొమాటో వరకు పలు కంపనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ర్యాపిడో హరీష్ శంకర్ తో పీవీసీ పైప్ యాడ్ కేఎఫ్ సీ వంటి పలు యాడ్ లని ఇటీవలే పూర్తి చేసిన అల్లు అర్జున్ తాజాగా మరో కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ కమర్షియల్ యాడ్ ని డైరెక్ట్ చేస్తున్నారు. జొమాటో కోసం ఇప్పటికే రెండు మూడు యాడ్ లు చేసిన బన్నీ తాజాగా మరో యాడ్ చేస్తున్నాడు.

దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. బన్నీ పాల్గొనగా త్రివిక్రమ్ ఈ కమర్షియల్ యాడ్ ఫిల్మ్ ని రూపొందిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు కమర్షియల్ యాడ్ ఫిల్మ్స్ ని పూర్తి చేశారు. ఇది మూడవది. డన్నీ - త్రివిక్రమ్ ల కలయికలో ఇప్పటికే మూడు సినిమాలొచ్చాయి. అందులో 'అల వైకుంఠపురములో' ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ ప్రాజెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ ఈ మూవీ తరువాత మరోసారి బన్నీతో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పనిచేయబోతున్నారట. అల్లు అర్జున్ త్వరలో 'పుష్ప 2'ని ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు.

అక్టోబర్ 10 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ తో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కూడా నటించే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED 'జైభీమ్' కి సీక్వెల్..హీరో ఎవరో తెలుసా?
×