ధూమ్ ధామ్ దోస్తాన్ : నేచురల్ స్టార్ ఇచ్చిపడేసిండు!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న యాక్ష‌న్ డ్రామా `ద‌స‌రా`. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ప‌క్కా తెలంగాణ నేప‌థ్యంలో బొగ్గుగ‌ని కార్మికుడిగా నాని న‌టిస్తున్న సినిమా ఇది. ఈ మూవీ ద్వారా యంగ్ స్ట‌ర్‌ శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఎస్ ఎల్వీ సినిమాస్ బ్యాన‌ర్ పై రూపొందుతున్న ఈ మూవీలో నానికి జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది.

రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన నాని మాసీవ్ అవ‌తార్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ గా `ధూమ్ ధామ్ దోస్తాన్‌` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని మేక‌ర్స్ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేశారు. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించిన ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. రాహుల్ సిప్లిగంజ్ మాంచి జోరుతో ఈ పాట‌ని త‌న‌దైన స్టైల్లో ఆల‌పించాడు.

సిల్క్ బార్ లో నేప‌థ్యంలో నానితో పాటు కొంత మంది పాల్గొన‌గా చిత్రీక‌రించారు. ప‌క్కా తెలంగాణ జాన‌ప‌ద స్లాంగ్ లో సాగిన ఈ పాట‌లో నేచుర‌ల్ స్టార్ నాని త‌న‌దైన మార్కుస్టెప్పుల‌తో ఇచ్చిప‌డేశాడు. మొగ్గుగ‌ని కార్మికులంతా క‌లిసి సేద‌తీరుతూ మందేసే స‌న్నివేశంలో వ‌చ్చే పాట‌గా ఈ సాంగ్ ని రూపొందించారు. `నీ య‌వ్వ మా మామ‌గాడు చెప్పుడు జ‌రే మీరు కొట్టుడు జ‌రే.. అంటూ నాని డైలాగ్ తో మొద‌లైన ఈ పాట‌లో ఊర మాసీవ్ స్టెప్పుల‌తో నేచుర‌ల్ స్టార్ నాని ఇచ్చిప‌డేశాడు.

పాట‌కు త‌గ్గ‌ట్టుగా సంతోష్ నారాయ‌ణ్ అందించిన బీట్ సాగి పాట‌ని మ‌రింత‌గా ఎలివేట్ చేసింది. ఈ పాట‌ని రాహుల్ సిప్లిగంజ్ తో పాటు పాల‌మూరు జంగిరెడ్డి, న‌ర్స‌మ్మ‌, గొట్టె క‌న‌క‌వ్వ‌, న్నోర దాసు ల‌క్ష్మీ ఆల‌పించారు. తెలంగాణ ఫోక్ ఫార్మాట్ లో కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాట థియేట‌ర్లలో స్టెప్పులేయించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఈ పాట‌లో నాని క‌నిపించిన లుక్ ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ గా మారి ప్ర‌తీ ఒక్క‌రినీ షాక్ కు గురిచేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని 2023 మార్చి 30న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. తొలి సారి మాసీవ్ పాత్ర‌లో న‌టిస్తున్న హీరో నాని ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌. స‌ముద్ర‌ఖ‌ని, సాయికుమార్‌, జ‌రీనా వాహెబ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీకి సినిమాటోగ్ర‌ఫీ స‌త్య‌న్ సూర్య‌న్‌, సంగీతం సంతోష్ నారాయ‌ణ‌న్‌, ఎడిటింగ్ న‌వీన్ నూలి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ అవినాష్ కొల్ల‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజ‌య్ చాగంటి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

 
 

× RELATED 'జైభీమ్' కి సీక్వెల్..హీరో ఎవరో తెలుసా?
×