కరీనా మీద అభిమాని చేయి.. ఎం జరిగిందంటే?

ప‌బ్లిక్ లో హీరోయిన్లు అభిమానుల‌ కంట‌బ‌డితే స‌న్నివేశం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. సెల్పీల కోసం..షేక్ హ్యాండ్ ల‌కోసం మీద మీద‌కి  ఎగ‌బ‌డ‌టం స‌హ‌జం. అదీ జనం గుమ్మిగూడితో తోపులాట‌లో మీద ప‌డ‌టం అంతే స‌హ‌జం. వీటిని అర్ధం చేసుకుని హీరోయిన్లు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోరు. మ‌రి కావాల‌ని మీద‌కి వ‌స్తే? ప‌నిగ‌ట్టుకుని భుజం మీద చేయి వేసి నెమ‌రాల‌ని ట్రై చేస్తే?  హీరోయిన్ ఎందుకు ఊరుకుంటుంది?  చెంప చెళ్లు మ‌నిపించ‌దు.

కానీ ఇక్క‌డ స‌న్నివేశం తారుమారైంది. మ‌రి అంత‌టి ద‌యాహృద‌యం గ‌ల హీరోయిన్ ఎవ‌రు? అస‌లు ఏం జ‌రిగిందో?  తెలియాలంటో వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ముంబై ఎయిర్ పోర్టులో క‌రీనా కారు దిగ‌గానే ఓ అభిమాని వెంబ‌డించాడు. ఆమెతో సెల్పీ దిగాల‌ని ప్ర‌య‌త్నించాడు. ఈక్ర‌మంలో అమ్మ‌డి భుజం మీద చేయివేసి హీరో లెవ‌ల్లో ఫోజు ఇవ్వాల‌నుకున్నాడు.

 కానీ ఇంత‌లోనే కరీనా సెక్యురిటీ అత‌ని వేగాన్ని గ‌మ‌నించి  చేతిని ప‌క్క‌కు నెట్టేసింది. దీంతో క‌రీనా ఒక్క‌సారిగా షాక్ అయింది. మీద మీద‌కి వ‌చ్చినా ప‌ట్టించుకోలేదు..చేయి చాచే స‌రికి షాక్ అయింది. అయితే ఆ స‌మ‌యంలో కరీనా మాత్రం ఆ అభిమానిని ఏం అన‌లేదు. ఆశ్చ‌ర్యానికి గురైనా ఆ త‌ర్వాత కాసేప‌టికి రిలాక్స్ అయింది.

అభిమానే క‌దా? అని అక్క‌డ నుంచి విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకోకుండా వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీంతో కరీనా స‌హ‌నాన్ని ప్ర‌శంసిస్తూ..ఆ అభిమాని ఆరాటాన్ని ఏకేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అభిమానం పేరుతో హీరోయిన్లు ఇబ్బంది పెడ‌తారా?  అత‌ను అమెను భ‌య‌పెట్టాడు. అలా ఎలా చేస్తారు?  కొంచెం కూడా భ‌యం వేయ‌లేదా? అంటూ మంద‌లిస్తున్నారు.

ఆ స‌మ‌యంలో కరీనా రియాక్ట్ అయి ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేద‌ని..వెంట‌నే అత‌న్ని పోలీసులొచ్చి  జైల్లో వేసే వార‌ని చెబుతున్నారు. ఏ పాపం తెలియ‌ని కొంత మంది అమాయ‌కుల్ని కొంత మంది మ‌హిళ‌లు త‌ప్పుడు కేసుల్లో ఇరికించి జైళ్ల‌లో వేస్తున్న రోజులివి. అలాంటిది  క‌రీనా మీద మీద‌కి వ‌స్తున్నా కూల్ గా ఉంది.

అలాంటి న‌టిని అభిమానులు ఎంత అపురూపంగా చూసుకోవాలి అంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.  ప్ర‌స్తుతం క‌రీనా బాలీవుడ్ లో ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆమె న‌టించిన లాల్ సింగ్ చ‌డ్డా భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చి చ‌తికిల ప‌డిన విష‌యం విధిత‌మే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

 

 
 
× RELATED 'జైభీమ్' కి సీక్వెల్..హీరో ఎవరో తెలుసా?
×