యూఎస్ స్కూల్ లో నాటు నాటు సాంగ్.. అదిరింది!

RRR సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొట్టమొదటి మల్టీ స్టార్ మూవీ కావడంతో కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా ఈ సినిమా విడుదలకు ముందే భారీగా హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు దర్శకదీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరపైకి తీసుకురావడం విదేశాల్లో కూడా మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది.

ఇక మొత్తానికి ఈ సినిమా ఓటిటి ద్వారా హాలీవుడ్ సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకోవడం విశేషం. ఇక విదేశాల్లో చాలామంది జనాలు ఈ సినిమాను చాలా బాగా చూశారు. ఇక ప్రస్తుతం జపాన్ లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

అయితే ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం విదేశాల్లోనే ఎక్కువగా వైరల్ అవుతూ ఉండడం విశేషం. రీసెంట్ గా అమెరికాలో కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ సినిమాలోని నాటు నాటు పాటను చాలా చక్కగా పాడి డాన్స్ చేశారు.

అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాలిఫోర్నియాలోని ప్లెసాంటన్‌లోని థామస్ హార్ట్ మిడిల్ స్కూల్ విద్యార్థులు ఇటీవల తమ పాఠశాల ఈవెంట్‌లలో ఈ పాటను ప్రదర్శించారు. వారు ఆ పాటను పాడిన విధానం కూడా ఎంతో చక్కగా ఉంది. తెలుగు పదాలను చాలా చక్కగా పలుకుతూ రాగాలు కూడా ఎక్కడా తడబడకుండా ఫుల్ జోష్ లో పాటను పాడుతూ ఉండడం విశేషం.

ఇక పాడుతున్న వారిలో కొంతమంది తెలుగు వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అందరూ కలిసికట్టుగా ఈ విధంగా తెలుగు పాటలు పాడడం మాత్రం గొప్ప విషయం అని చెప్పవచ్చు. సినిమా ఎంతగా క్రేజ్ అందుకుందో ఈ పాటతో మరోసారి అర్థమయింది.

ఇక ఇప్పుడు RRR సినిమాకు ఆస్కార్ రావాలి అని చాలామంది కోరుకున్నారు. కానీ ఆ సినిమాకు కాకుండా మరో సినిమాలో నామినేషన్స్ లోకి పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ తప్పకుండా ఆస్కార్ బరిలో సినిమాలో నిలుస్తుంది అని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

 
 

 
× RELATED 'జైభీమ్' కి సీక్వెల్..హీరో ఎవరో తెలుసా?
×