హీరోయిన్ ని ఆటపట్టించిన జాతిరత్నం!

బెల్లంకొండ గణేష్ హీరోగా తెరంటేగ్రం చేస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ హీరోయిన్. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. వివాదాస్పద అంశం నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. శిల్పకళా వేదికలో భారీగా ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ కి 'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి హాజరయ్యాడు. తనదైన శైలిలో మాట్లాడి నవ్వులు పూయించాడు. అంతే కాకుండా హీరోగా స్ట్రగుల్స్ లో వున్న సమయంలో తనకు ఈవెంట్ లలో పాల్గొనే అవకాశం రాలేదని చెప్పుకొచ్చాడు. ఇక స్వాతిముత్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం చాలా ఆనందంగా వుందన్నాడు. చాలా రోజుల తరువాత మిమ్మల్ని ఇలా కలుసుకోవడం హ్యాపీ అన్నాడు.

ఇదే సందర్భంగా 'జాతిరత్నాలు'లోని జోగీపేట శ్రీకాంత్ క్యారెక్టర్ లోకి వెళ్లిపోయి నవ్వులు పూయించాడు. నేను శిల్పకలా వేదికలో ఉన్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చానని ఫోన్ పెట్టేయడం నవ్వులు పూయించింది. కొన్నేళ్ల క్రితం ఇదే  శిల్పకళా వేదిక కు ఓ ఈవెంట్ లో పాల్గొనాలని వస్తే పాస్ లేదని తిప్పి పంపించారట.. అయితే ఇప్పడు అదే దేవికకు చీఫ్ గెస్ట్ గా రావడం నన్ను ఆ స్థాయికి తెలుగు ప్రేక్షకులు తీసుకెళ్లి నాకు గొప్ప గౌరవాన్నిచ్చారన్నాడు.

ఇక నాకు గణేష్ పేరంటే ఇష్టం అంటూ వైన్స్ షాప్ పేరు చెప్పి నవ్వులు పూయించిన నవీన్ పొలిశెట్టి హీరోయిన్ వర్షా బొల్లమ్మని ఆటపట్టించాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ లో ఆనంద్ దేవరకొండతో చేశావు.. ఇప్పుడు బెల్లంకొండ తో చేస్తున్నావు మీరు కొండాపూర్ లో వుంటారా?  లేదా మణికొండలో వుంటారా? మీకు కొండలలో నెలకొన్న పాట అంటే ఇష్టమా అంటూ వర్షా మొల్లమ్మని ఆటపట్టించాడు. ఆ తరువాత చిట్టి పాటకు తనతో స్టెప్పులేసి ఎంటర్ టైన్ చేశాడు.

సుమతోనూ స్టెప్పులేసిన నవీన్ పొలిశెట్టి ఈ సందర్బంగా తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు.  సినిమా ఏడాది అవుతోందని వున్నావా చచ్చావా? అని ఫ్యాన్స్ మెసేజ్ లతో ట్రోల్ చేస్తున్నారని తన డ్రైవర్ కూడా తనపై ఈ విషయంలో పంచ్ లు వేస్తున్నాడని కామెడీ చేసి అందిరినీ నవ్వించాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED 'జైభీమ్' కి సీక్వెల్..హీరో ఎవరో తెలుసా?
×