రేసుగుర్రం స్టార్ చీటింగ్ కేసు.. రూ.3.25 కోట్ల మోసపోయాడట

తెలుగు ప్రేక్షకులకు రేసు గుర్రం.. సైరా సినిమాలతో పాటు పలు చిత్రాల్లో నటించి చేరువ అయిన నటుడు రవి కిషన్. విలన్ గా తనదైన శైలిలో నటించి అత్యంత క్రూరంగా బాడీ లాంగ్వేజ్ చూపించగల రవి కిషన్ కి నటుడిగా మంచి పేరు దక్కింది. తెలుగులో మాత్రమే కాకుండా పలు భాషల్లో నటించి మెప్పించిన రవి కిషన్ ని ముంబయి కి చెందిన వ్యాపారవేత్త చీట్ చేశాడట.

రవి కిషన్  కొన్ని సంవత్సరాల క్రితం ముంబయి వ్యాపారవేత్త అయిన జైన్ జితేంద్ర రమేశ్కు 3.25 కోట్ల రూపాయలను ఇచ్చాడట. ఆ డబ్బును జైన్ జితేంద్ర ఇవ్వకుండా రవి కిషన్ ను గత కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్నాడట. ఆ డబ్బు చెల్లింపు విషయంలో జాప్యం జరిగిందట.

ఆ డబ్బు చెల్లింపులో భాగంగా 34 లక్షలకు చెందిన 12 చెక్కులను రవి కిషన్ కి జైన్ జితేంద్ర ఇచ్చాడట. ఆ చెక్ లు బౌన్స్ అవ్వడంతో కేసు నమోదు అయ్యింది. తనను మోసం చేయడంతో పాటు చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశాడంటూ రవి కిషన్ ఆరోపిస్తున్నారు.

బీజేపీ ఎంపి అయిన రవి కిషన్ ఇప్పుడు ఫిర్యాదు చేశారు. జైన్ జితేంద్ర పై చీటింగ్ కేసు పెట్టిన రవి కిషన్ తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడట. తనకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి జైన్ జితేంద్ర ను రవి కిషన్ పదుల సార్లు అడిగినా ప్రయోజనం లేకుండా పోయిందని జాతీయ మీడియా లో కథనాలు వస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED #లిక్కర్ క్వీన్.. ట్విటర్ లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్
×