పోస్టర్స్ తోనే పూనకాలు తెప్పిస్తోన్న గాడ్ ఫాదర్!

మెగాస్టార్ చిరంజీవి కథానాయుడిగా నటిస్తోన్న 'గాడ్ ఫాదర్' రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకా విడుదలకు వారం రోజులే సమయముంది. దీంతో ఉన్న సమయాన్ని వీలైంతనంగా జనాల్లోకి సినిమాని తీసుకెళ్లే అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ప్రీ -రిలీజ్ వేడుకకు ముందు పోస్టర్లతోనే ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తుంది టీమ్.

ఇప్పటికే మెగాస్టార్ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్..ట్రైలర్ ఓ రేంజ్ లో కిక్కిచ్చాయి. మెగా అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఔట్ ఫుట్ ఉండబోతుందని సంకేతాలు అందేసాయి. తాజాగా కొత్త పోస్టర్లు అంతకంతకు అంచనాలు పెంచేస్తున్నాయి. మెగాస్టార్ డిఫరెంట్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మునుపెన్నడు చిరంజీవి ఇలాంటి ఆహార్యంలో కనిపించింది లేదు.

నెరిసిన తల..గెడ్డం..కాస్ట్యూమ్స్ అన్నీ చిరుని కొత్తగా ప్రజెంట్  చేస్తున్నాయి. సినిమాపై తొలుత కాస్త నెగిటివ్ ప్రచారం జరిగినప్పటికీ తాజా అప్ డేట్స్ అన్ని పాజిటివ్ గా మూవ్ అవుతున్నాయి. 'ఆచార్య'తో మిస్ అయిన బ్లాక్ బస్టర్ 'గాడ్ పాదర్' తో  కొట్ట బోతున్నారంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి చిరు పక్కన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఉండటంతో?  ఫ్యాన్స్ లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తుంది. బాస్..భాయ్ బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేయడం ఖాయమంటున్నారు.

మరి అభిమానులు అంచనాలు ఎంత వరకూ నిజమవుతాయో చూడాలి. దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అనంతరం చిరంజీవి ప్రీ అవుతారు. అటుపై ఏకధాటిగా వాల్తేరు వీరయ్య షూటింగ్ లో పొల్గొంటారు. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతి కానుకగా ఆ చిత్రం రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్ కల్లా అన్ని పనులు పూర్తి చేసి సిద్దంగా ఉండాలి. మరోవైపు  మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగానూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా బాస్ ఒకదాని వెంట మరో చిత్రం రిలీజ్  చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసేలా పెద్ద ప్లాన్ తో నే ముందుకొస్తున్నట్లు కనిపిస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఏ స్టార్ హీరో ఎక్కడెక్కడ ఇరగదీస్తున్నాడంటే?
×