జపాన్ వేటని కన్పమ్ చేసిన రాజమౌళి అండ్ కో!

'ఆర్ ఆర్ ఆర్' పాన్ ఇండియాలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ ని షేక్ చేసిన భారతీయ రెండవ చిత్రంగా నిలిచింది. అమెరికా సహా నెట్ ప్లిక్స్ లోనూ రిలీజ్ అయి గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన చిత్రంగా నిలిచింది.  హాలీవుడ్ మేకర్స్ సైతం మెచ్చిన చిత్రంగా నిలిచింది. బాహుబలి తర్వాత గ్లోబల్ స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ నిలుస్తుందా?  లేదా? అన్న సందేహాలకు నెట్ ప్లిక్స్ సక్సెస్ తో పుల్ స్టాప్ పడింది.

అంతార్జాతీయ వేదికలపైనా ఆర్ ఆర్ ఆర్ దుమ్ముదులిపేసి మరోసారి తెలుగోడి సత్తా ఏంటన్నది ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' జపాన్ వేటకు సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. జపాన్ వెర్షన్ లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే   జపానీస్ వెర్షన్ కు చెందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ పోస్టర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టకుంది.

అక్కడా సునామీ వసూళ్లు తప్పవని సోషల్ మీడియా వేదికగా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సినిమాని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తారా?  లేదా? అని కొద్ది రోజులుగా సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అన్నింటిని తుడిచి పెట్టేస్తూ ఎస్ జపాన్ లోనూ  భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నట్లు  రాజమౌళి ధృవీకరించారు.

కొద్ది సేపటి క్రితమే  ప్రత్యేక వీడియోలో మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్తున్నట్లు రివీల్ చేసారు.  రాజమౌళితో పాటు పాన్ ఇండియా హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ప్రమోషన్ కి హాజరనవుతున్నట్లు దాదాపు కన్పమ్ అయింది. ఇప్పటికే విదేశీయులు సైతం మెచ్చిన చిత్రంగా నిలిచింది.

అందులోనూ జపాన్ లో రాజమౌళి సినిమాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. బాహుబలి సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాతోనే రాజమౌళి..రానా..ప్రభాస్ లకు భారీ ఎత్తున అభిమానులు ఏర్పడ్డారు. అదే తీరున ఆర్ ఆర్ ఆర్ తో చరణ్..ఎన్టీఆర్ లకు జపాన్ లోనూ  ఫాలోయింగ్ పెంచే బాధ్యత రామౌళి తీసుకుని ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED మహేష్.. రాజమౌళి సినిమాలో హాలీవుడ్ స్టార్స్..!
×