బాలయ్య టైటిల్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పుడే!

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అఖండ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న బాలయ్య బాబు ఇప్పుడు అంతకు మించి అనేలా సక్సెస్ అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ప్రేక్షకుల్లో అంచనాల స్థాయిని పెంచేసింది. నల్లని షర్టులో మెరిసిన గెడ్డంతో బాలయ్య బాబు హై వోల్టేజ్ గా కనిపించాడు.

తప్పకుండా సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని నందమూరి అభిమానులు ధీమాతో ఉన్నారు. ఇక సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు జై బాలయ్య అన్నగారు అనే టైటిల్స్ అయితే చర్చల దశలో ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే ఎక్కువగా జై బాలయ్య టైటిల్ కు ఓటేశారు.

ఇక ఫైనల్ గా టైటిల్ ను అక్టోబర్ 2వ తేదీన ఎనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో  గోపీచంద్ కమర్షియల్ పాయింట్స్ ఎక్కువగా హైలెట్ చేయబోతున్నట్లు టాక్. ఏకంగా ఫారిన్ లో కూడా ఒక ఫ్యాక్షన్ సన్నివేశం ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఏకంగా టర్కీలో బాలయ్య బాబు ఫ్యాక్షన్ లీడర్లను కత్తితో ఊచకూత కోస్తున్న సన్నివేశాలు ఉండబోతున్నట్లు షూటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఒక విధంగా ఇది ఇప్పుడే ట్రోలింగ్ కు దారి తీసేలా ఉంది. విదేశాల్లో ఈ ఫ్యాక్షన్ ఏమిటి అంటూ అక్కడ కూడా మనలాంటి కత్తులు దొరుకుతాయా అని ఇతర నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని అయితే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నాడు కానీ ఏ మాత్రం తేడా కొట్టిన కూడా సోషల్ మీడియాలో ట్రోలర్స్ కు స్టఫ్ గట్టిగానే దొరుకుతుంది అని మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మంచి సందేశం కూడా ఉంటుంది అని ముఖ్యంగా యాక్షన్ ఎలిమెంట్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయి అని చెబుతున్నారు. మరి బాలయ్య బాబు అఖండ తర్వాత చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED 2023 సంక్రాంతి ఫైట్.. రిలీజ్ డేట్స్ ఫిక్స్!
×