బాలయ్యపై హిజ్రాల ఫిర్యాదు.. తెరవెనుక.. వైసీపీ కీలక నేత?

రాష్ట్రంలో ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్పు వ్యవహారంపై.. అధికార వైసీపీ.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో ఎన్టీఆర్పై వైసీపీ మంత్రులు జోరుగానే వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ యాక్షన్కు.. టీడీపీ నుంచి కూడా ఘాటుగానే రియాక్షన్ వచ్చింది. ముఖ్యంగా అన్నగారి కుమారుడు.. బాలయ్య ట్విట్టర్ వేదికగా.. తీవ్రవ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా.. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

అయితే.. ఇప్పుడు.. బాలయ్యను ఏదో ఒకరకంగా బద్నాం చేయాలనే కుట్ర హిందూ పురంలో సాగుతున్న ట్టు తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఆయనపై ఏకంగా.. కొందరు నాయకులు.. ముఖ్యంగా హిందూపు రం టికెట్ను ఆశిస్తున్న ఓ వృద్ధ నేత.. బాలయ్యపై ఫిర్యాదు చేయించారని సొంత పార్టీ నాయకులే అంటున్నారు.

దీనికి వైసీపీ నాయకులు హిజ్రాలను పావులుగా వాడుకున్నారని చెబుతున్నా రు. బాలయ్య హిందూపురంలో ఉండడం లేదని పేర్కొంటూ.. కొందరు హిజ్రాలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే.. ఇది ఎంత నాటకీయ పరిణామమో.. వారు చెప్పిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే.. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే.. నేరుగా స్టేషన్కు వెళ్తారు. కానీ ఇక్కడ పోలీసులే.. ఫిర్యాదు చేసేవారి వద్దకు వచ్చి.. మీడియాతో వాళ్లు మాట్లాడే వరకు ఉంది.. ఆనక తీరిగ్గా ఫిర్యాదు తీసుకున్నారు. ఇది .. ఉద్దేశ పూర్వకంగా.. చేసిన ఫిర్యాదేనని.. చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇక ఫిర్యాదు చేసిన వారు.. సదరు పత్రంలో ఏముందో కూడా చదవలేక ఇబ్బందులు పడ్డారు. అంటే.. అది వారు రాసిన ఫిర్యాదు కానేకాదు. సో.. దీనివెనక కర్త.. కర్మ.. క్రియ వేరే వారు ఉన్నారని అర్ధమవు తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. పైగా.. హిజ్రాలు చేసిన ఫిర్యాదు కొత్తదేం కాదు. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు కూడా.. కరోనా సమయంలో హైదరాబాద్లోనే ఉన్నారు. కొందరు బెంగళూరులోనూ ఉన్నారు.

మరి బాలయ్య ఒక్కడే హిందూపురంలో ఉండలేదని.. ఎలా చెబుతారు? ఇక అభివృద్ది అనేది.. వైసీపీ నేతల ఇలాకాల్లోనే కనిపించడం లేదు. ఇక ప్రతిపక్షంలో ఉన్న బాలయ్యకు ఎలా సాధ్యం.. అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ వర్సిటీ వివాదాన్ని యూటర్నం చేయించేందుకు.. వైసీపీ నేతలు ఆడుతున్న నాటకాల్లో ఇదిఒక భాగమని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED #లిక్కర్ క్వీన్.. ట్విటర్ లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్
×