ఇందిరా దేవి గారికి ప్రముఖుల సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి.. మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇందిరా దేవి మృతి పట్ల సినీ ప్రముఖులు స్పందిస్తూ తమ సంతాపం తెలియజేశారు. మహేష్ బాబు.. కృష్ణలతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు.

చిరంజీవి... శ్రీమతి ఇందిరా దేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ సూపర్ స్టార్ కృష్ణ గారికి సోదరుడు  మహేష్ బాబు కి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.

చంద్రబాబు నాయుడు... ప్రముఖ నటులు కృష్ణ గారి సతీమణి మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇందిరా దేవి గారి మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ బాధ నుండి త్వరగా కోలుకునే మానసిక శక్తిని కుటుంబ సభ్యులకు అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... కృష్ణ గారి సతీమణి మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇందిరా దేవి తృది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ బాధ నుండి కృష్ణ గారు మహేష్ బాబు గారు త్వరగా కోలుకునే మనో ధైర్యంను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.

బాలకృష్ణ ... ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి ఘట్టమనేని మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధకరం. కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

వెంకటేష్... ఇందిరా దేవి గారు మృతి చెందడం విచారకరం. మహేష్ బాబు మరియు కృష్ణ గారికి సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను.

ఎన్టీఆర్... ఇందిరా దేవి గారు మృతి చెందడం చాలా బాధాకరం. ఈ దుఃఖ సమయంలో కృష్ణ గారికి మహేష్ అన్నకు మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

రవితేజ.. ఇందిరా దేవి గారి మరణ వార్త తెలిసి బాధపడ్డాను.. కృష్ణ గారికి హృదయపూర్వక సానుభూతి మహేష్ మరియు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

నారా లోకేష్... ప్రముఖ నటులు సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరాదేవి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED 2023 సంక్రాంతి ఫైట్.. రిలీజ్ డేట్స్ ఫిక్స్!
×