చెఫ్ మంత్ర-2 కోసం హీటెక్కించే బ్యూటీ!

ఓటీటీ ఆహా వేదికగా ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ కి కొదవలేదు. రకరకాల షోలతోటు..డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రాగ్రామ్స్ చేస్తూ ఆహా ఓటీటీల్లోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. టీవీ షోలకు ఆహా ఇప్పుడు గట్టి పోటీనిస్తుంది. డ్యాన్స్.. కామెడీ.. సింగింగ్.. కుకింగ్ షోలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇప్పటికే   ఆహా వేదికగా 'చెఫ్ మంత్ర'  అనే ఫుడ్ కార్యక్రమం ప్రసారమైంది.

సీజన్ వన్ కు శ్రీముఖి యాంకర్ గా వ్యవహిరించింది. అది పెద్ద సక్సెస్ అయింది. ఫుడ్డీస్ ని ఆ షో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో చెఫ్ మంత్ర-2 కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రసారం కానున్న సీజన్ 2 కార్యక్రమం కోసం మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్నారు. ఈ షో ద్వారా సెలబ్రిటీలను ఆహ్వానించి వారి చేత వంటలు చేయిస్తూ వారి నుంచి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం  ప్రత్యేకత.

ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ ప్రోమో కూడా రిలీజ్ అయింది. సెప్టెంబర్ 30 నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రతి శుక్రవారం ప్రసారం కానుంది.  ఈ సందర్భంగా లక్ష్మి సంతోషాన్ని వ్యక్తం చేసారు.  తాను ఇలా ఫుడ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. మొట్ట మొదటి అతిధిగా  సిజ్లింగ్ బ్యూటీ మాళవిక మోహనన్ పాల్గొందని తాజా సమాచారం.

ఇప్పటికే షూట్ కూడా పూర్తిచేసినట్లు తెలుస్తుంది. మరి అమ్మడు ఎలాంటి వంటకాలతో ఆహా ప్రియుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ బ్యూటీ ఇంకా తెలుగులో ఎంట్రీ ఇవ్వలేదు. మలయాళం.. హిందీ..తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది. కోలీవుడ్ లో కెరీర్ ని బిల్డ్ చేసుకునే ప్లాన్ లో ఉంది. అలాగే టాలీవుడ్ పైనా కన్నేసినట్లు ప్రచారం సాగుతోంది.

తరుచూ ఇక్కడ దర్శక-నిర్మాతలకు టచ్ లో  ఉంటుందని సమాచారం.  ఈ నేపథ్యంలో కొంత మంది స్టార్ హీరోల సరసన ఎంపికైందని ప్రచారం సాగింది.   కానీ ఇంత వరకూ ఒక్క ఛాన్స్ కూడా అందుకున్నట్లు అధికారిక సమాచారం  లేదు. మరి  ఆహా వేదిక అవకాశాలకు బాట వేస్తుందేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED 'అవతార్-2' రిలీజ్ ముందు మరోసారి టాప్ గన్: మేవరిక్!
×