జక్కన్నని ఆశ్చర్యపరచిన 'PS' విషయం

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించిన చర్చ తారా స్థాయిలో జరుగుతోంది. మణిరత్నం కొన్ని పదుల సంవత్సరాలుగా ఈ సినిమాను తీయాలని కలలు కన్నాడు. ఎట్టకేలకు సినిమా కార్యరూపం దాల్చి విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమా గురించిన ఒక విషయం తెలుసుకున్న సమయంలో రాజమౌళి ఆశ్చర్యపోయాడట. ఈ విషయాన్ని సినిమాలో ఒక హీరోగా నటించిన జయం రవి చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా జయం రవి సినిమాకు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చాడు.

ఆ సమయంలోనే జయం రవి మాట్లాడుతూ... పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్ ల షూటింగ్ ని కూడా కేవలం 150 రోజుల్లోనే పూర్తి చేశాం అంటూ రాజమౌళి గారికి తెలిసిన సమయంలో ఆశ్చర్యపోయారు. ఇంత భారీ సినిమాను అది కూడా రెండు పార్ట్ లను అంత తక్కువ రోజుల్లో ఎలా పూర్తి చేశారు అంటూ చాలా సమయం ఆశ్చర్యంగా మణిరత్నం గారిని రాజమౌళి గారు అడిగి తెలుసుకున్నారు అంటూ జయం రవి చెప్పుకొచ్చాడు.

తమిళ మీడియా ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు పెంచుతూ మాట్లాడుతున్న ఈ సినిమాలో విక్రమ్.. ఐశ్వర్యరాయ్.. త్రిష.. కార్తి.. ప్రకాష్ రాజ్.. జయం రవి ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీ నటులు నటించారు. ఇది తమిళంలోనే అతి పెద్ద మల్టీ స్టారర్ మూవీగా ప్రచారం జరుగుతోంది. వెయ్యి కోట్ల వసూళ్ల లక్ష్యంగా ఈనెల 30వ తారీకున రాబోతున్న ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఇప్పుడు అందరి చూపూ మైత్రీ వైపే..!
×