వీడియో : మెగా డాటర్ డాన్స్ మెడ్లీ తో కుమ్మేసింది

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక కొనిదెల. మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె అయిన నిహారిక పలు సినిమాల్లో నటించింది. నటిగానే కాకుండా మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకున్న నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత పూర్తిగా నటనకు పూర్తిగా దూరం అయ్యింది. అప్పుడప్పుడు బుల్లి తెరపై మరియు సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది.

నటిగా సినిమాలకు దూరం అయినా కూడా నిర్మాతగా సినిమాలను నిర్మిస్తుంది. ఇటీవలే ఒక ఓటీటీ ప్రాజెక్ట్‌ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. నటిగా మంచి ప్రతిభావంతురాలు అనిపించుకున్న నిహారిక నటించిన సమయంలో డాన్స్ తో ఎక్కువ సందడి చేయలేదు. నిహారిక డాన్స్ యాంగిల్ గురించి కొద్దిమందికే తెలుసు.

ఇప్పుడు నిహారిక తన సోషల్‌ మీడియాలో స్నేహితురాలితో కలిసి వేసిన డాన్స్ మెడ్లీ తో వైరల్‌ అవుతోంది. ఒక్కటి కాదు రెండు కాదు చాలా పాటలకు బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ తీసుకోకుండా నిమిషం వ్యవధిలో డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపర్చింది. ఒక పాటకు కంటిన్యూ గా డాన్స్ చేయడం కష్టం కాకపోవచ్చు.. కానీ ఇలా ఒకే సారి ఇన్ని పాటలకు డాన్స్ చేయడం.. స్టెప్స్‌ ను గుర్తు ఉంచుకోవడం పెద్ద విషయం.

నిహారిక మరియు ఆమె స్నేహితురాలు పుష్ప సినిమాలోని శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్స్‌... ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా లోని నాటు నాటు డాన్స్ స్టెప్స్‌... ది వారియర్ లోని బుల్లెట్‌ బండి పాటలోని హుక్ స్టెప్స్‌... ఇంకా పలు పాటలకు స్నేహితురాలు మృణాళితో చేసి నిహారిక అబ్బుర పర్చింది. ఈమె వీడియోతో కుమ్మేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

 
 

× RELATED నెక్స్ట్ సినిమా అప్ డేట్ ఎప్పుడు ఎన్టీఆర్?
×