దసరాతో అయిపోలేదా.. అసలు ఫైట్ ముందుందా?

ప్రతీ సారి దసరాకు బిగ్ ఫైట్ కామన్ గా కనిపిస్తూ వుంటుంది. అయితే ఈ దసరా ఫైట్ తరువాత మరో బిగ్ ఫైట్ రాబోతోంది. దసరా బరిలో బిగ్ స్టార్స్ నటించిన సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి నటించిన `గాడ్ ఫాదర్` భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తొలి సారి మెగాస్టార్ పాటలు హీరోయిన్ లేకుండా ప్రయోగాత్మకంగా చేసిన మూవీ ఇది. `ఆచార్య`తో షాక్ కు గురైన చిరు `గాడ్ ఫాదర్ ` విషయంలో మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ తో కనిపిస్తున్నారు.

రీసెంట్ గా శుక్రవారం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. యు/ ఏ లభించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చినంజీవి బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకుని బ్లూ షర్ట్ వైట్ లుంగీ ధరించి స్వాగ్ తో నడుచుకుంటూ వస్తున్న కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ కొత్త పోస్టర్ నెట్టింట వైరల్ గా మారి ఆకట్టుకుంటోంది. ఇక ఇదే సినిమాతో కింగ్ నాగార్జున ` ది ఘోస్ట్` మూవీతో పోటీకి దిగుతున్నాడు. ముందు నుంచి ఈ మూవీపై పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది.

ఈ రెండు సినిమాలతో పోటీగా మంచు విష్ణు `జిన్నా` మూవీతో వస్తుండగా కొత్త హీరో బెల్లంకొండ గణేష్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ `స్వాతిముత్యం`తో ధైర్యం చేస్తున్నాడు. ఇవి తప్ప దసరా బరిలో మరే సినిమా దిగడం లేదు. దీపావళికి మాత్రం బిగ్ ఫైట్ వుండే అవకాశం వుందని తెలుస్తోంది. 24న దీపావళి ఫెస్టివెల్ జరగబోతోంది. మూడు రోజుల ముందుగానే దీపావళి సంబరాల్ని `ఓరి దేవుడా !` మూవీ మొదలు పెట్టబోతోంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ దేవుడిగా నటించడంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా క్రేజీ ప్రాజెక్ట్ ల జాబితాలో చేరిపోయింది.

ఈ మూవీని అక్టోబర్ 21న రిలీజ్ చేస్టున్నట్టుగా మేకర్స్ ప్రకటించేశారు. ఇదే రోజున మాస్ మహారాజా రవితేజ `ధమాకా` కూడా వచ్చేస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీని త్రినాథరావు నక్కిన రూపొందించారు. ఇక తమిళ హీరో శివకార్తికేయన్ తో `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ రూపొందించిన `ప్రిన్స్` తమిళ తెలుగు భాషల్లో దీపావళికి సందడి చేమబోతోంది.

ఇక తమిళ హీరో కార్తి ద్విపాత్రాభినయం చేసిన `సర్దార్` మూవీ కూడా దీపావళికే వచ్చేస్తోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సర్దార్ శక్తి అనే వయసుమల్లిన డాన్ పాత్రలో కార్తి నటిస్తున్నాడు. ఈ మూవీపై కూడా అంచనాలు భారీగానే వున్నాయి. తెలుగులో ఈ మూవీని కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 24నే ఈ మూవీ తమిళ తెలుగు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. ఇక వీటీతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా ఇదే సీజన్ కి రాబోతుండటంతో పోటీ రసవత్తరంగా వుంటుందని తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED డబ్బు జల్లడంలో టాలీవుడ్ తర్వాతనే ఎవ్వరైనా?
×