వీడియో : పొట్టి నెక్కర్ లో శ్రీవల్లి క్యూట్ అందాల ఆరబోత

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా తెలుగు లో గీతా గోవిందం సినిమా తో ఒక్కసారిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమా తో పాటు తెలుగు లో వరుసగా సినిమాలు చేయడంతో ముద్దుగుమ్మ యొక్క క్రేజ్ అమాంతం పెరిగింది. పుష్ప సినిమా తర్వాత ఈమె పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ గా మారిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ.. కన్నడం మరియు తమిళంలో కూడా సినిమాలు చేస్తున్న రష్మిక మందన్నా ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ఈమె ముంబైలో ప్రత్యక్షం అయ్యింది. అక్కడ ఒక హిందీ సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్ ముందుకు వచ్చింది. ఆ సందర్భంగా ఈ అమ్మడు తన అందంతో అందరికి కూడా ఆకట్టుకుంది.

పొట్టి నెక్కర్‌ లో ముద్దుగుమ్మ యొక్క అందాల ఆరబోతకు అంతా కూడా ఫిదా అవుతున్నారు. స్టైల్‌ గా క్యూట్‌ గా థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఈ అమ్మడు చేసిన ఫోటో షూట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి పొట్టి నెక్కర్‌ పోటోలు మరియు వీడియో లు తెగ వైరల్‌ అవుతున్నాయి. శ్రీ వల్లి కుమ్మేసిందిగా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ అమ్మడి యొక్క సినిమాల విషయానికి వస్తే తమిళంలో వారసుడు సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా ఈమె తెలుగు లో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. హిందీలో ఈమె రెండు మూడు సినిమాలు చేస్తోంది. రాబోయే ఏడాది కాలంలో ఈమె బాలీవుడ్‌ లో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

 
 
× RELATED ఇసుకలో ఆడుకుంటూ.. బికినీతో సర్ప్రైజ్ చేసిన బ్యూటీ
×