అణుయుద్ధం జరిగితే.. అమెరికా కీలక సూచన

ఆధునిక కాలంలో యుద్ధాలకు ఆస్కారం లేదని అంతా అనుకున్నారు. కేవలం అభివృద్ధిలో మాత్రమే పోటీ అనుకున్నారు. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ .. తాజాగా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధంతో అంతా తలకిందులైంది. ప్రపంచమే ప్రభావితం అవుతోంది. అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. ముందస్తు జాగ్రత్తలే మేలు అని సూచిస్తోంది.

ఈ క్రమంలోనే అమెరికా దేశ పౌరులకు ఆదేశ ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగుతున్నందున రష్యా అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే అమెరికా అప్రమత్తమైంది.

అణుయుద్ధం జరిగినప్పుడు మీ జుట్టుకు షాంపూలు కండీషనర్ లను ఉపయోగించవద్దని అమెరికా సూచించింది. సాధారణ రోజుల్లో షాంపూ కండీషనర్లు మీ జుట్టును రక్షిస్తాయని.. కానీ అణు విస్పోటనం సంభవించినప్పుడు షాంపూలు కండీషనర్లు మీ జుట్టుకు రేడియోధార్మిక పదార్థాల మధ్య జిగురుగా పనిచేస్తాయని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. రేడియో ధార్మిక పదార్థాలను ట్రాప్ చేసే అవకాశం ఉన్నందున  షాంపూలు కండీషనర్ లను ఉపయోగించవద్దని ప్రజలకు సూచించింది.

అణుబాంబు పేలితే రేడియోధార్మిక ధూళి కణాలు గాలిలోకి విసిరివేసినట్లయితే మీరు వీలైనంత త్వరగా స్నానం చేయాలని అమెరికా సలహా ఇచ్చింది. అణు విస్ఫోటనం జరిగినప్పుడు ప్రజలు కలుషితమైన పాత దుస్తులను తొలగించి వెంటనే స్నానం చేయాలని అమెరికా డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ ప్రజలకు కీలక సూచన చేసింది. ౌ

అణుబాంబులతో రేడియేషన్ వ్యాపిస్తుంది. అది జుట్టుపై కండీషనర్లను ఉపయోగించినప్పుడు తలకు పట్టుకుంటుంది. ఈ కణాలు మణి కణాలను దెబ్బతీస్తాయని.. అది ప్రాణాంతకంగా మారుతుందని అమెరికా పేర్కొంది.

అందుకే అణుబాంబు పేలినప్పుడు ప్రజలు రేడియేషన్ ను నివారించడానికి ఇటుక లేదా కాంక్రీట్ భవనం లోపల ఆశ్రయం పొందాలని అమెరికా సిఫార్సు చేసింది. ప్రజలు తమ కళ్లు ముక్కు నోటిని తాకకుండా ఉండాలని కీలక సూచనలు చేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఫైర్బ్రాండ్ నానీకి .. జగన్ బిగ్ షాక్
×