కరోనా తర్వాత విద్యార్థుల్లో మానసిక ఆనారోగ్య సమస్యలు.. కారణం ఇదే

ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా తర్వాత.. కరోనా ముందు అని వర్గీకరించాల్సిన అవసరం ఉంది.  కోవిడ్ రేపిన కల్లోలం అలా తీవ్ర ప్రభావం చూపింది. అందరినీ మార్చేసింది. కోవిడ్ తో అన్ని రంగాలు కుదేలు అవ్వడమే కాదు.. వ్యక్తిగతంగా కూడా మనుషులపై  వారి పనితీరుపై ప్రభావం చూపింది.  కోవిడ్ కాలంలో మొత్తం ఆన్ లైన్ తరగతులతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దీని ప్రభావం ఇంకా పిల్లలను పట్టిపీడిస్తోందని ఉపాధ్యాయులు మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

కోవిడ్ 19 కారణంగా పిల్లలు కౌమారదశలో ఉన్న ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్య పరిణామాలనుపలు సవాళ్లను తీసుకువచ్చింది. దు:ఖం భయం అనిశ్చితి సామాజిక ఒంటరితనం పెరిగిన స్ట్రీన్ సమయం వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరిగి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఇన్నాళ్లు పాఠశాలల్లో  స్నేహాలు కొనసాగించిన విద్యార్థులు ఇప్పుడు స్నేహాలు కుటుంబ మద్దతు పిల్లలకు బలమైన శక్తులుగా మారాయి. కోవిడ్ 19 దీనికి అంతరాయం కలిగిందని యూనిసెప్ తెలిపింది.

కరోనా తర్వాత పాఠశాలకు వస్తున్న పిల్లలు మానసికంగా దృఢంగా లేరంటున్నారు. నిరాశ ఆందోళన భావోద్వేగం వంటి మానసిక సమస్యలతో పాఠశాలకు తిరిగి వస్తున్న పిల్లలు ఎదుర్కొంటున్నారని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహమ్మారి కారణంగా ప్రియమైన వారిని కోల్పోయిన విద్యార్థుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

అందుకే పాఠశాల పిల్లలు ఇతరుల పట్ల సానుభూతి చూపేలా ఒత్తిడి ఆందోళన సమయాల్లో ఒకరినొకరు మద్దతుగా ఉండేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే పిల్లల్లో మానసిక కల్లోలం ఆందోళన సమస్యను అరికట్టడానికి  ఎలాంటి యంత్రాంగం లేదు. కానీ ప్రతి బిడ్డకు ఇది బోధించడం.. మరొకరి పట్ల సానుభూతితో మెలగడం వంటివి పరిస్థితిని నియంత్రించడంలో సహాయపడుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

కేవలం పిల్లలే కాదు.. యువతలో కూడా టెన్షన్ పెరిగింది. ఈ ఆందోళనకు చికిత్స చేయకపోతే తీవ్రమైన మానసిక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. యువతలో డిప్రెషన్ ఇతర మానసిక సమస్యల కేసులు చాలా రెట్లు పెరిగిపోయాయి. ఏకాగ్రత లేకపోవడం పిల్లల జీవితంలో తరువాతి దశలో తలెత్తే సమస్యలకు సంకేతంగా పేర్కొన్నారు. వారి స్వంత జీవితంలో అనిశ్చితి ఒత్తిడి కారణంగా వారి పిల్లల ఆందోళనను శాంతింపజేయడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED వైసీపీ నోట అమరావతి మాట...మార్చిందెవరు...?
×