సీనియర్ హీరోయిన్ మళ్లీ మొదలు పెట్టిందిగా!

సీనియ‌ర్ హీరోయిన్ మీనా మ‌ళ్లీ సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఇటీవ‌ల మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ పోస్ట్ కోవిడ్ స‌మ‌స్య‌ల కార‌ణంగా శ్వాస‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ హాస్పిట‌ల్ లో చేరారు.

అయితే ఆయ‌న ఊరిపి తిత్తులు 90 శాతం పాడైపోయిన‌ట్టుగా గుర్తించిన డాక్ట‌ర్లు మార్పిడి కోసం ప్ర‌య‌త్నంచారు. డోన‌ర్ కోస్ ప్ర‌య‌త్నించినా ల‌భించ‌క‌పోవ‌డంతో విద్యాసాగ‌ర్ ఇటీవ‌ల లంగ్స్ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా మృతి చెందారు.

దీంతో ఒక్క‌సారి గా మీనా ఫ్యామిలీ పెద్ద దిక్కుని కోల్పోయింది. మీనా భ‌ర్త మృతితో త‌మిళ ఇండ‌స్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఒక్క‌సారిగా షార్ కు గుర‌య్యాయి. భ‌ర్త ఆక‌స్మిక మృతితో మీనా ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. గ‌త కొన్ని నెల‌లుగా షాక్ లో వుండిపోయిన మీనా ఆ త‌రువాత కోలుకుని త‌న కూతురు కోసం, తన ఫ్యామిలీ కోసం మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టింది.

భ‌ర్త సాగ‌ర్ మ‌ర‌ణం త‌రువాత ప‌బ్లిక్ వేదిక‌లైన సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌ని మీనా మ‌ళ్లీ యాక్టీవ్ అయింది. సాగ‌ర్ ఈ ఏడాది జూన్ లో మృతి చెందారు. అప్ప‌టి నుంచి దాదాపు మూడు నెల‌లుగా సోష‌ల్ మీడియాకు దూరంగా వుంటూ వ‌చ్చింది మీనా. రీసెంట్ గా త‌ను అంగీక‌రించిన సినిమా షూటింగ్ ల‌లో పాల్గొంంది.

ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు వీడియోల‌ని అభిమానుల‌తో పంచుకోవ‌డం గ‌మ‌నార్హం. తిరిగి సినిమాల్లో న‌టించ‌డం ప్రారంభించిన మీనా మేక‌ర్స్ ని ఆక‌ట్టుకోవ‌డం కోసం తాజాగా ఫొటో షూట్ లో పాల్గొంది.

ఇందుకు సంబంధించిన వీడియోని సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. పింక్ క‌ల‌ర్ డ్రెస్ లో క‌ర్లింగ్ హెయిర్ తో స్టైలిష్ లుక్ లో క‌నిపిస్తున్న మీనా వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

 

 
× RELATED ఇందిరా దేవి గారికి ప్రముఖుల సంతాపం
×