'ది ఘోస్ట్' బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయంటే..?

కింగ్ అక్కినేని నాగార్జున సోలో హీరోగా సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలం అయింది. అయితే లేటెస్ట్ మూవీ ''ది ఘోస్ట్'' తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతానని నాగ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేశారు.

క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటించిన హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ''ది ఘోస్ట్''. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ మరియు 'వేగం' సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

'ది ఘోస్ట్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. హీరో నాగార్జున పారితోషికం మినహాయించి ఈ సినిమాని 20 - 22 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రమోషనల్ కంటెంట్ క్రియేట్ చేసిన బజ్ తో ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ కు రూ. 20 - 25 కోట్ల బిజినెస్ జరిగినట్లు టాక్. ఏషియన్ ఫిల్మ్స్ వారు ఈ ప్రాజెక్ట్ ను అడ్వాన్స్ బేసిస్ మీద ప్రపంచవ్యాప్తంగా సొంతంగా విడుదల చేసుకుంటున్నారు.

ఇక 'ది ఘోస్ట్' సినిమా కోసం నాగార్జున రెమ్యునరేషన్ తోపాటుగా ఆంధ్రా ప్రాంతంలోని కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తీసుకుంటున్నారని టాక్ ఉంది. ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు.

అక్కినేని అభిమానులు సైతం నాగ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని ధీమాగా ఉన్నారు. మౌత్ టాక్ బాగుంటే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ''ది ఘోస్ట్'' చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. ఇందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్ గా నాగార్జున కనిపించనున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా.. గుల్ పనాగ్ - అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు.

మార్క్ కె రాబిన్ - భరత్ - సౌరబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ అందించగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. దినేష్ సుబ్బరాయన్ మరియు కేచా మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

'ది ఘోస్ట్' చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీని తర్వాత నాగార్జున నటించే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే దీనిపై అనౌన్స్ మెంట్ ఇస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED డబ్బు జల్లడంలో టాలీవుడ్ తర్వాతనే ఎవ్వరైనా?
×