టీడీపీ స్క్రిప్ట్ జూనియర్ ఎంటీయార్ ట్వీట్ చేస్తే మంచివాడు... లేకపోతే కాదా...?

జూనియర్ ఎన్టీయార్  అద్భుత సినీ నటుడు. ఆయన వెండి తెర మీద రెండు దశాబ్దాలుగా తనదైన నటనతో రాణిస్తున్నారు. ఒక విధంగా తన స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన ప్రతిభాశాలి జూనియర్. ఆయన తానుగా రాజకీయాల వైపు రాలేదు. 2009 ఎన్నికల్లో ఆయన సేవలు పార్టీకి కావాలంటే జూనియర్ అప్పట్లో ప్రచారం చేశారు. ఇక టీడీపీ పెద్దలు ఆయన్ని దూరం పెడితే పల్లెత్తు మాట అనకుండా తన సినిమాలు తాను చేసుకుంటున్నారు.

అటువంటి జూనియర్ విషయంలో మాత్రం టీడీపీ ఫక్తు రాజకీయమే చేస్తూ ఉంటుంది అని అంటారు తమకు అనుకూలంగా జూనియర్ ఉండాలి. కానీ ఆయన్ని మాత్రం దూరమే పెడతామన్న నీతినే టీడీపీ ఇప్పటికీ అమలు చేస్తోంది. లేకపోతే ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య రాజకీయ ఘర్షణ ఉంటే మధ్యలో జూనియర్ కి ఏంటి సంబంధం. ఆయన సినీ నటుడుగా ఉన్నారు. అయినా నందమూరి కుటుంబానికి సంబంధించినంతవరకూ ఆయన ఎపుడు రియాక్ట్ కావాలో అపుడు రియాక్టు అవుతున్నారు.

ఇదిలా ఉంటే విజయవాడలోని ఎన్టీయార్  హెల్త్ వర్శిటీకి ఎన్టీయార్  పేరుని మార్చేసి డాక్టర్ వైఎస్సార్ పేరుని పెడుతే ఏపీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. దాని మీద జూనియర్ ఇది తప్పు అన్నట్లుగానే ట్వీట్ చేశారు. అయితే ఆయన ఎక్కడా రాజకీయ పరిభాష వాడకుండా తన హుందాతనాన్ని నిలబెట్టుకుంటూ ట్వీట్ చేశారు. అదే ఇపుడు టీడీపీ నాయకులకు కడుపు మంటగా ఉందిట.

జూనియర్ ట్వీట్ చేసిన తీరు బాలేదని ఒక్క లెక్కన ట్రోలింగ్ చేస్తున్నారు. జూనియర్ చేసిన ట్వీట్ టీడీపీకి దాని అనుకూల మీడియకు నచ్చకపోతే అందులో ఆయన తప్పు ఏముంది అన్నదే ఇక్కడ చర్చ. ఇక వైఎస్ జగన్ సోదరి షర్మిలను రోజూ విమర్సించే టీడీపీ అనుకూల మీడియా జగన్ చేసిన నిర్ణయం తప్పు అని చెప్పడంతో ఆమె ప్రకటనను పెద్ద హెడ్డింగులు పెట్టి మరీ అచ్చు వేశారు టీవీలలో పదే పదే చూపిస్తున్నారు.

ఇక టీడీపీ అనుకూల మీడియా వైఖరి చూస్తే వేరే  సమస్య లేనట్లుగా అదే పనిగా ఎన్టీయార్  చేసిన ట్వీట్ మీద డిబేట్ల మీద డిబేట్లు పెడుతున్నారు. జూనియర్ రియాక్షన్ సరిగ్గా లేదని తామే తీర్పు ఇచ్చేసి అదే ఒప్పు అని  అనుకుంటున్నారు. జూనియర్ ట్వీట్ చేశారు. అది కరెక్ట్ కాదని ఏలా చెబుతారు. ఆయన లోకేష్ భాషలోనో లేక కొడాలి నాని భాషలోనో ట్వీట్ చేస్తే బాగుండేదా. లేక సాదర జనాలు తిట్టుకునే భాషలో ట్వీట్ చేస్తే పసుపు చానళ్ళకు పండుగగా కనిపించేదా అన్న చర్చ కూడా ఇక్కడ వస్తోంది మరి.

ఇక జూనియర్ ట్వీట్ చూస్తే పేరు మార్పు అన్నది తప్పు అని గట్టిగానే ఖండించారు. ఒకరికి స్థాయి పెరగదు మరొకరికి తరగదు అని కూడా చెప్పాల్సిన మాటలు గట్టిగా చెప్పారు. మరి అది కరెక్ట్ గా లేదు అంటే ఇష్టం వచ్చినట్లుగా తిట్టాలా అసభ్య పదాలను వాడాలా అని మేధావులు సైతం అంటున్నారు.

ఇక విషయానికి వస్తే జూనియర్ ఎన్టీయార్ కి టీడీపీకి ఏమిటి సంబంధం అన్న ప్రశ్న కూడా వస్తోంది మరి. జూనియర్ ఎన్టీయార్  ని ఎపుడూ టీడీపీ కలుపుకుని పోలేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే అని కూడా అంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీయార్ ని పార్టీ చేరదీసిందా ఆయన సలహా సూచనలతో పార్టీ పనిచేస్తోందా అంటే ఏమీ లేదు. మరి ఆ మాత్రం దానికి జూనియర్ టీడీపీ స్క్రిప్ట్ తోనే మాట్లాడాలి వారి బుర్రలతోనే ఆలోచన చేయాలి అని ఎలా కోరుకుంటారు అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.

ఈ రోజు డిబేట్లు పెడుతున్న వారు అంతా జూనియర్ ని ఒక సినీ నటుడిగా కాకుండా ఆయన్ని రాజకీయ రొచ్చులోకి దిగలాగాలని చూసే కుత్శిత ప్రయత్నమే  ఏవగింపుగా ఉందని అంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీయార్  టాలీవుడ్ అగ్ర నటుడు. అతని స్టామినా ఏంటో లోకమంతా చూసింది. ఏ మాత్రం సత్తా లేని లోకేష్ కింద టీడీపీలో జూనియర్ ఎన్టీయార్  పని చేయాలా అని ఎంటీయార్ ఫ్యాన్స్ అంటోంది అంటే పచ్చ మీడియా ఈ విషయంలో ఒ ఒక్కసారి  బుర్ర పెట్టి ఆలోచన చేస్తే మంచిదేమో

ఎంతసేపూ తమ పచ్చ కళ్లాద్దాలతోనే లోకమంతా చూస్తూ తమ మాటే అంతా వినాలని అదే వేదమని పచ్చ మీడియా భావించవచ్చు కాక. కానీ ఆ రోజులు ఎపుడో పోయాయి. ఇపుడు ఎవరి భావాలు వారికి ఉన్నాయి. ఎవరి చానల్ వారికి ఉంది. తమ బుర్రలోని గుజ్జుని తెచ్చి ఎదుటి వారి బుర్రల్లో దూర్చాలనుకుంటే అసలు కుదరదు అనే అంటున్నారు. ఇకనైనా ఈ ఆయాసాలు  పచ్చ పైత్యాలకు స్వస్తి వాచకం పలికి లోకం ఎలా ఉందో దాన్ని అలాగే చూపిస్తే పచ్చ కళ్లద్దాలు తీసేస్తే అంతా బాగానే కనిపిస్తుంది వినిపిస్తుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED వైసీపీ నోట అమరావతి మాట...మార్చిందెవరు...?
×