'నగ్న' వ్యక్తి అర్ధరాత్రి షికార్లు.. హడలి చస్తున్న స్థానికులు

నగ్నంగా ఉన్న వ్యక్తి  నవీముంబైలో తిరుగుతున్న దృశ్యాలు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒంటిపై నూలుపోగులేకుండా వెళుతున్న వ్యక్తి వీడియోలు సీసీటీవీ ఫుటేజీలో భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.  నగ్నంగా ఉన్న వ్యక్తి  చుట్టూ   పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత 15 రోజులుగా థానే సమీపంలోని దిఘా నివాసితులకు కంటినిండా నిద్ర కరువైంది.  స్థానికులకు ఆత్మవిశ్వాసం కల్పించేందుకు పోలీసులు జనసాంద్రత ఎక్కువగా ఉండే కృష్ణవాడి సంజయ్ గాంధీ నగర్ అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో రాత్రిపూట నిఘాను పెంచారు.

చల్లగాలి కోసం  రాత్రి తన ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు బట్టలు లేని వ్యక్తిని చూశానని అక్కడి స్థానిక నివాసి పేర్కొన్న తర్వాత  ప్రజల్లో భయం మొదలైంది.. "ఆ వ్యక్తి ఇంట్లోకి చూస్తున్నాడు. అతను పూర్తిగా నగ్నంగా ఉన్నాడు. నేను ఎవరు అని అరిచిన తర్వాత అతను పారిపోవడం ప్రారంభించాడు. నేను అతనిని వెంబడించాను కానీ అతను సందులలో అదృశ్యమయ్యాడు "అని అజ్ఞాత నగ్న వ్యక్తి  పై స్థానికుడు వివరించాడు.

కొద్దిసేపటికే సీసీటీవీ కెమెరాల్లో నగ్నంగా ఉన్న వ్యక్తిని  దృశ్యాలు బయటపడ్డాయి. క్లిప్లలో ఆ వ్యక్తి ఎలాంటి బట్టలు లేకుండా ఆయుధాన్ని చేతపట్టుకొని తిరుగుతున్నట్టు కనిపించింది. నివాసితులు పైకప్పు మీద అడుగుల చప్పుడు కూడా విన్నారని పైకప్పు గుండా చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రచారం సాగింది.  ఈ సంఘటన జరిగాక పుకార్లకు తెరలేసింది. కొందరు సీరియల్ రేపిస్టులు సంచరిస్తున్నారని కొందరు అనుమానించారు.  అయితే పోలీసులకు అలాంటి ఫిర్యాదులేమీ అందలేదు.

ఆయుధంగా నగ్న వ్యక్తి రాత్రుళ్లు తిరుగుతుండడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు. "రాత్రిళ్లు పిల్లలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. తెల్లవారుజామున కూడా గృహిణులకు బయటకు వెళ్లే ధైర్యం చేయడం లేదు'' అని కృష్ణవాడిలో నివసించే పూజా యాదవ్ అన్నారు. "మేము ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. కాని వారు మొదట మమ్మల్ని లైట్ తీసుకున్నారు.. ఇప్పుడు సీసీటీవీలో చూశాక వారు ప్రతి రాత్రి ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు "అన్నారాయన.

రాత్రిపూట నిఘా పెంచామని  పోలీసులు తెలిపారు. "దిఘా ప్రాంతం చాలా ఎక్కువ జనాభాను కలిగి ఉంది. దాదాపు 5000 ఇళ్లు భవనాలు ఉండాలి. ఇరుకైన దారులు ఎవరినైనా వెంబడించడం కష్టతరం అవుతుంది" అని మంగళవారం రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఒక పోలీసు చెప్పారు. "నివాసులలో నిజంగా భయం ఉంది. కానీ మేము మనిషిని గుర్తించడానికి మరియు ట్రాక్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము" అన్నారాయన.

రాత్రి పెట్రోలింగ్ కోసం 2-3 మంది అధికారులు 20 మంది కానిస్టేబుళ్లను నియమించినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ సుధీర్ పాటిల్ తెలిపారు. "త్వరలో ఆ వ్యక్తిని గుర్తించగలమని మేము విశ్వసిస్తున్నాము. అలాగే ముఠా కాదు ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారని మేము నమ్ముతున్నాము"అని అతను చెప్పాడు. వాస్తవాల కంటే ఈ వ్యక్తుల గురించి ఎక్కువ పుకార్లు ఉన్నాయి. సీసీ టీవీ  ఫుటేజీ ఆందోళనగానే ఉంది. కానీ అది ఎక్కడ జరిగిందో ధృవీకరించడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాము. ఇప్పటి వరకు తీవ్రమైన నేరాలు ఏమీ లేవు. ఇప్పుడే కాల్వా పోలీసులు ఇలాంటి రూపాన్ని కలిగి ఉన్న ఒకరిని పట్టుకున్నారని మాకు సమాచారం అందింది. విచారణ జరుపుతున్నామని " ఆ ప్రాంత డీసీపీ తెలిపారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఈడీ అరెస్ట్ లు: టీఆర్ఎస్ నేతల ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్.. ఏం జరుగుతోంది?
×